Monday, September 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంట్రాక్టర్ పై ప్రజావాణిలో కలెక్టరుకు ఫిర్యాదు

కాంట్రాక్టర్ పై ప్రజావాణిలో కలెక్టరుకు ఫిర్యాదు

- Advertisement -

కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతభత్యాలపై విచారించాలని వినతి
నవతెలంగాణ – వనపర్తి

ప్రభుత్వాసుపత్రిలో ఔట్సోర్సింగ్ కార్మికుల జీతాలు దోచుకుంటున్న కాంట్రాక్టర్ పై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు ఆధారాలతో జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ కాంట్రాక్టర్కు మద్దతుగా ఓ ప్రజాప్రతినిధి  ఉన్నారని అందులో పేర్కొన్నారు. గతంలో మెడికల్ కాలేజీ ఏర్పడ్డ నాటి నుండి ప్రభుత్వ ఆసుపత్రిలలో 148 మందిని తీసుకోవాల్సి ఉండగా కొద్ది మందితో పని చేయిస్తూ, పూర్తిస్థాయిలో జీతాలు దోచుకుంటున్న కాంట్రాక్టర్, అధికారులపై వారందరూ కుమ్మక్కై లక్షలకు లక్షలు దోచుకుంటున్నారని కలెక్టర్ కు వివరించినట్లు తెలిపారు. గతంలో ఇదే విషయంపై ఫిర్యాదు చేస్తే దర్యాప్తు పేరుతో లోలోపల దాన్ని అధికారులు కప్పిపెట్టారని, అడిగిన మమ్మల్ని ఆధారాలు చూపమని చెప్పారన్నారు. ఇప్పుడు పూర్తి ఆధారాలతో ప్రజావాణిలో కలెక్టర్ ముందుకు వచ్చామని తెలిపారు. 

మెడికల్ కాలేజ్ అయిన తర్వాత జిల్లా ఆసుపత్రులలో కాంట్రాక్టు సిబ్బంది 148 మంది గా నిర్ణయించారన్నారు. దీనికి కాంట్రాక్టర్ శ్రీకాంత్ రెడ్డి అనే అతను కంటిన్యూగా కాంట్రాక్టర్ గా ఉంటున్నాడని తెలిపారు. వేరే వారిని రానీయకుండా ప్రభుత్వాలు మారినా అతన్ని మాత్రం మార్చడం లేదన్నారు. అయితే 148 మంది పనిచేయకుండా 148 మంది జీతాలు డ్రా చేస్తూ దోపిడీ చేస్తున్నారని పేర్కొన్నారు. రోజువారి హాజరు పట్టికలను రెండుగా పెట్టుకుని అధికారికంగా ఒకటి, అనధికారికంగా ఒకటి పెడుతున్నారన్నారు. అధికారికంగా రోజూ 100 మంది హాజరు వేస్తూ పనిచేస్తున్నట్లు చూయిస్తున్నారన్నారు.

కానీ 70 నుండి 80 వరకు మాత్రమే పనిచేస్తున్నట్టు తేలిందని పేర్కొన్నారు. దీనిలో 18 మంది పనిచేయకుండా వారిపైనే జీతాలు తీసుకుంటున్నట్లు తెలుస్తుందన్నారు. కొందరు చనిపోయిన వారి పేరుపై ఇంకా జీతం డ్రా చేస్తున్నారన్నారు. కార్మికులను విధుల్లోకి తీసుకున్నప్పుడు కార్మికులతో ఇద్దరు నాయకులు కమిషన్లు కూడా తీసుకున్నట్లు తెలిసిందన్నారు. ఇలా మొత్తంగా నెలకు 10 లక్షల నుండి 20 లక్షల వరకు  అన్ని కలిపి మూడు సంవత్సరాలుగా కోట్లలో డబ్బులు కాజేస్తున్నారని మాకు అందిన సమాచారం ప్రకారం తెలిసిందని తెలిపారు. సి ఎస్, ఆర్ ఎం ఓ 

రోజు 24 గంటలు అందుబాటులో ఉండవలసిన రెడ్డి కుమారి వారంలో రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయని తెలిపారు. కాంట్రాక్టర్ సమయం ఈనెల మొదటి వారంలో అయిపోయినా కూడా కొనసాగిస్తున్నారన్నారు. గత మూడు సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం అతన్ని కొనసాగించడం అతనితో అధికారులు లక్షల్లో కమిషన్లు తీసుకున్నట్లుగా తెలుస్తుందన్నారు. కార్మికులకు పి.ఎఫ్ అమౌంట్ ఇవ్వవలసి ఉన్న కూడా ఇప్పటివరకు ఎవ్వరికీ ఇవ్వలేదన్నారు. వెంటనే దీని కారణమైన కాంట్రాక్టర్ను అదుపులోకి తీసుకుని మొత్తంగా వసూలు చేయాలన్నారు. అలాగే దీనిలో భాగమున్న సూపరింటెండెంట్, మిగతా అధికారులను సస్పెండ్ చేయాలని అఖిల పక్ష ఐక్య వేదిక డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సతీష్ యాదవ్ తో పాటు గంధం నాగరాజు, వెంకటేశ్వర్లు, కొత్తగొల్ల శంకర్ గౌనికాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్, నక్క సురేష్ యాదవ్, గంధం భరత్ కుమార్, నాగరాజు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -