నవతెలంగాణ-నవీపేట్: ఆశా వర్కర్లను అకారణంగా ముందస్తు అరెస్టుల పేరుతో నిర్భంధించడం సరైన చర్య కాదని, దీని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాయక్ వాడి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశా వర్కర్లకు రాష్ట్రంలో ఏటువంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు పిలుపు లేకపోయినప్పటికీ పోలీసులు ఆశ వర్కర్లను ఉదయాన్నే ముందస్తు అరెస్టులు చేయడం ఏంటని ప్రశ్నించారు. మహిళ ఆశా వర్కర్లను ఏటువంటి సమాచారం లేకుండా ఇండ్ల వద్దకు వెళ్లి అక్రమంగా అరెస్టులు చేయడమే కాకుండా సిఐటియు నాయకుల పట్ల అసభ్యకర పదజాలం వాడటాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ విషయన్ని ఎస్సై తిరుపతి దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు దేవేందర్ సింగ్, ఆశలు సబిత, ఇంద్ర మరియు ఇతర గ్రామాల ఆశ వర్కర్లు ఉన్నారు.
ఆశా వర్కర్లను ముందస్తుపేరుతో అరెస్టు చేయడం సరికాదు: సిఐటియు

- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES