Monday, September 15, 2025
E-PAPER
Homeఆదిలాబాద్పింఛన్ల కోసం తహశీల్దార్ కార్యాలయం ముట్టడి..

పింఛన్ల కోసం తహశీల్దార్ కార్యాలయం ముట్టడి..

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్
 నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో సోమవారం మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్ఎఫ్) ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ఎం ఎస్ ఎఫ్ జిల్లా అధికార ప్రతినిధి జి. మహేశ్వర్ డిమాండ్ చేశారు.ముధోల్ లోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ గా తహసిల్దార్ కార్యాలయం ను ముట్టడించారు . ఈసందర్భంగా ఆయన మాట్లాడారు వృద్ధులకు,  వికలాంగులకు ,బీడీ వర్కర్లకు ,ఒంటరి మహిళలకు పెన్షన్ డబ్బులను పెంచి అందిస్తాం చెప్పిన ప్రభుత్వం నేటికీ అమలుపరచడం లేదని ప్రశ్నించారు. వెంటనే ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కోరారు. అనంతరం పలుడిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసిల్దార్ శ్రీలతకు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు తుకారం, వికలాంగుల హక్కుల పోరాట సమితి సభ్యులు, పెన్షన్ పోరాట హాక్కుల సమితి సభ్యులు ,మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సభ్యులు, తదితరులు, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -