నవతెలంగాణ – ముధోల్
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లోని ఐసిడిఎస్ కార్యాలయంలో సోమవారం ఐసిడిఎస్ సిడిపిఓ సరోజినీ ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్లకు పోషన్ బి ,పడాయిబి అనే పధకం పై శిక్షణ కార్యక్రమంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ శిక్షణ మూడు రోజులపాటు కొనసాగుతాయని తెలిపారు. అంగన్వాడి టీచర్లకు కార్యక్రమం వివరాలను తెలియజేశారు. బాల్య సంరక్షణ, విద్యపై, అంగన్‌వాడీ వ్యవస్థపై శిక్షణ ఇచ్చారు. ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు బాల్య సంరక్షణ, విద్య, పోషకాహార సేవలను అందించడంలో నైపుణ్యాలను పెంపొందించడానికి తీసుకోవల్సిన చర్యల గురించి సీడీపీఓ వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ విజయ్ కుమార్, సూపర్వైజర్లు ఉమా,అనిత , అంగన్వాడి టీచర్లు తదితరులు, పాల్గొన్నారు.
ముధోల్ లో పోషన్ భీ, పడై భీపై శిక్షణ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES