డాక్టర్ చుక్కారామయ్య ట్రస్ట్ చైర్మన్ పుల్లయ్య
నవతెలంగాణ – పాలకుర్తి
విద్యార్థినీ, విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంతోపాటు సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులేనని డాక్టర్ చుక్కారామయ్య ట్రస్ట్ చైర్మన్, గూడూరు మాజీ సర్పంచ్ మాచర్ల పుల్లయ్య అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలను పురస్కరించుకొని సోమవారం మండలంలోని గూడూరు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పుల్లయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామీణ ప్రాంత విద్యార్థిని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధిస్తూ విద్యార్థినీ, విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
గత సంవత్సరం పదవ తరగతిలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థులకు 5 వేలు, రెండవ ర్యాంకు సాధించిన విద్యార్థులకు 3 వేలు నగదు ప్రోత్సాహకాలను త్వరలో అందిస్తామని తెలిపారు. పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని, విద్యార్థులను డాక్టర్ చుక్కారామయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రోత్సహిస్తామని తెలిపారు. పదవ తరగతి ఫలితాలను సాధించి గూడూరు పాఠశాలను జిల్లాలోని ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు సమన్వయంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శైలజ మాట్లాడుతూ విద్యార్థినీ, విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు నగదు ప్రోత్సాహకాల పంపిణీ దోహదపడుతుందని తెలిపారు. విద్యార్థుల్లో పోటీ తత్వం పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ ఆర్ యాక లక్ష్మి, ఉపాధ్యాయులు టి నిర్మల, ఎం చంద్రమోహన్, రమేష్ బాబు, దయాకర్ రెడ్డి, ఏ మధుకర్, నవీన్, నజీమా, చిట్యాల యాదగిరి, ఏ సులోచన తదితరులు పాల్గొన్నారు.
సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES