నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని హాస కొత్తూర్ గ్రామంలో ఆశా కార్యకర్తలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను చౌటుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్య పర్యవేక్షకులు చింత సత్యనారాయణ సోమవారం పరిశీలించారు. ఆశా కార్యకర్తలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే రికార్డులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికి తిరిగినప్పుడు జ్వరంతో బాధపడుతున్న వారి వివరాలు, వారికి అందిస్తున్న చికిత్స వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు.
సర్వే సందర్భంగా దోమలు మృతి చెందకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో దోమలు ఎక్కువగా ఉండటం మూలంగా మలేరియా, డెంగ్యూ విష జ్వరాలు సోకే ప్రమాదం ఉందని అందుకే ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరిగి అవగాహన కలిగిస్తున్నారని ఆయన తెలియజేశారు. వర్షాకాలంలో బయట తినుబండారాలను తినకూడదని, తద్వారా కలరా టైఫాయిడ్ పేరా టైప్ సోకే ప్రమాదం ఉందన్నారు. చౌటుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్ని గ్రామాల్లో సర్వేను నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య విస్తరణ అధికారి సత్యనారాయణ తెలిపారు.
హాస కొత్తూర్ లో ఇంటింటి సర్వే పరిశీలన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES