నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
స్వచ్ఛతా-హీ-సేవ 2025 – స్వచ్ఛోత్సవాలని విజయవంతం చేయాలనీ కోరుతూ సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధికారులతో కలిసి సంబంధిత పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. యాదాద్రి భువనగిరి జిల్లాను ముందంజలో ఉంచాలని, కేంద్ర త్రాగునీరు & పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ ఆదేశానుసారం సెప్టెంబర్ 17 వ తేదీ నుండి అక్టోబర్ 02 వ తేదీ వరకు స్వఛ్ఛోత్సవ్ అనే నినాదంతో స్వచ్చతా హీ సేవ 2025 పక్షోత్సవాలని నిర్వహించడం జరుగుతుందనీ తెలిపారు.
స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవాలలో శ్రమదానాలు, పిచ్చిమొక్కలు, గడ్డి మొక్కలు తొలగింపు, తడి పొడి చెత్త నిర్వహణపై ఇంటింటికీ అవగాహన కార్యక్రమాలు, వాడి పడేసిన వస్తువుల్ని కళాత్మకంగా తయారు చేసి పునర్వినియోగంలోకి తీసుకువచ్చే వస్తువుల్ని విద్యార్థులు, మహిళా సంఘం సభ్యులు, పంచాయతీ కార్యదర్శుల చేత తయారు చేయించడం జరుగుతుందన్నారు. పారిశుద్ధ్య కార్మికులకి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, రక్షణ కిట్లని పంపిణీ చేయడం, స్వచ్ఛతా ర్యాలీ, స్వచ్ఛతా రన్, స్వచ్ఛతా మానవహారం, స్వచ్ఛతా ప్రతిజ్ఞ , స్వచ్చత పై వ్యాసరచన , కవిత, వక్తృత్వ పోటీలు నిర్వహించడం, చెత్త పేరుకుపోయిన , సమస్యాత్మక స్థలాలు గుర్తించి శుభ్రం చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈఓ శోభారాణి, జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, హౌసింగ్ పిడి విజయ సింగ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
స్వచ్ఛతహీ – సేవ 2025 పోస్టల్ ఆవిష్కరించిన కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES