Monday, September 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయాలి..

సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయాలి..

- Advertisement -

ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్టీ, ఎస్సీ, బీసీ సంక్షేమ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయాలని విద్యార్థుల సంఖ్య తక్కువ ఉండి హాజరులు ఎక్కువగా చూపిస్తున్న హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు కోరారు. సోమవారం  భువనగిరి కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణిలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ హనుమంతురావు కి వినతి పత్రం అందజేశారు. 

ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభమైన నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు దుప్పట్లో ప్లేట్ గ్లాసులు అందించలేదనీ, తెలంగాణ విద్యారంగం అంటేనే సంక్షేమ హాస్టల్ గొప్పగా చెప్పుకుంటూ ప్రజాపాలన ప్రభుత్వం విద్యార్థులకు ఇప్పటికీ దుప్పట్లు పంపిణీ చేయకుండా కాలయాపన చేస్తుందని ఆరోపించారు. 

వర్షాకాలం విద్యార్థులకు దుప్పట్లేక ఎలా నిద్రపోతారని వర్షాలు చలి తీవ్రత ఉన్న విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయకుండా, పాత దుప్పట్లతోటి కాలం గడుపుతున్నారనీ , కొత్తగా వచ్చినటువంటి విద్యార్థులకు పంపిణీ చేయకుండా కాలయాపన చేస్తు, హాస్టల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి హాజరులో ఎక్కువ శాతం చూపిస్తున్న, హాస్టల్ లో  హాస్టల్లో వీధి దీపాలు, మంచినీటి సౌకర్యం కల్పించకుండా అవకతవకలకు పాల్పడుతున్న వార్డెన్లపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో కోరారు.  తక్షణమే జిల్లా కలెక్టర్ ,అధికారులు హాస్టల ను సందర్శించి అవకతవకలు పాల్పడుతున్న హాస్టల్ వార్డెన్ లపై చర్యలు తీసుకోవాలని కోరారు.  ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు, ఈర్ల రాహుల్, దరావత్ జగన్ నాయక్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -