Monday, September 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలి

కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలి

- Advertisement -

ఎంఎస్పీ మండల ఇన్చార్జి ఈదురు సైదులు మాదిగ 
నవతెలంగాణ – పెద్దవంగర

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని ఎంఎస్పీ మండల ఇంచార్జ్ ఈదురు సైదులు మాదిగ డిమాండ్ చేశారు. చేయూత పెన్షన్ దారుల హక్కుల పోరాట సమితి, వి.హెచ్.పి.ఎస్, ఎంఎస్పీ ఆధ్వర్యంలో సోమవారం తహశీల్దార్ కార్యాలయం ముట్టడించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ వీరగంటి మహేందర్ కు అందజేశారు. ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 22 నెలలు కావస్తున్న, నేటి వరకు చేయూత పెన్షన్లు పెంచకపోవడం సిగ్గుచేటు అన్నారు.

పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో గత రెండు నెలలుగా చేయూత పెన్షన్లు పెంచాలని పలు నిరసనలు వ్యక్తం చేస్తున్నా, ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చేయూత పెన్షన్లు పెంచాలని, లేని పక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ధర్మారపు ఉమ, స్వాతి, జలగం ముత్తయ్య, చిలుక మల్లయ్య, చిలుక వెంకటయ్య, షేర్ల వెంకటయ్య, చిలుక సిద్దు మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల నాయకులు జలగం శ్రీను మాదిగ, రాంపాక ఐలయ్య మాదిగ, చింతల ఐలయ్య మాదిగ, చేయూత పెన్షన్ దారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -