నవతెలంగాణ-పాలకుర్తి
మండల కేంద్రంలో గల ప్రాథమిక పాఠశాలకు జనగామ కు చెందిన న్యాయవాది ఆలేటి సిద్ధి రాములు సోమవారం 6 వేల విలువగల మూడు ఫ్యాన్లను మండల విద్యాశాఖ అధికారి పోతుగంటి నర్సయ్య తో కలిసి బహుకరించారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిదురాల శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో, పాఠశాల అవసరాలతో పాటు విద్యార్థుల అవసరాల కోసం పాఠశాలలో గల గ్రంథాలయం గదిలో ఫ్యాన్లను అమర్చామని తెలిపారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. విద్యార్థినీ, విద్యార్థులు దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకొని విద్యలో రాణించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. పాఠశాలకు ఫ్యాన్లు బహుకరించిన సిద్ధిరాములను అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పాఠశాలకు ఫ్యాన్లు బహుకరించిన సిద్ధిరాములు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES