Tuesday, September 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మిషన్ భగీరథ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ విప్ కు వినతి..

మిషన్ భగీరథ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ విప్ కు వినతి..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
మిషన్ భగీరథ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఆలేరు ఎమ్మెల్యే,  ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య  కు వివేరా హోటల్లో  వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేష్ మాట్లాడుతూ .. మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని,ఇతర సమస్యలు పరిష్కరించాలని  మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్( సిఐటియు ) జిల్లా కమిటి అధ్వర్యంలో వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు.

గత 08 సంవత్సరాలుగా  పాత పద్ధతిలో ప్రాజెక్ట్ లలో పనిచేసే జిఓ 45  ద్వారా ప్రస్తుతం వేతనాలు కేవలం 10 వేల లోపు మాత్రమే ఇస్తున్నారని, జిఓ నెం 60 ప్రకారం  కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని,రాత్రి వేళలో విధులు నిర్వహిస్తూ అనాజిపురం , బొమ్మలరామారంలలో పాము కాటుకు గురై చావు అంచుదాక  వెళ్ళి వచ్చారని ఈ పరిస్థితు లలో ప్రతి ఒక్కరికి టార్చ్ లైట్,హెల్మెట్  ,కార్మికులకు 8 గంటల పని అమలు చేయాలని,20 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించే విధంగా ప్రభుత్వం తరుపున  ప్రయత్నం చేయాలని కోరారు.

ఈ  కార్యక్రమంలో తెలంగాణ మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ( సిఐటియు  ) జిల్లా  అధ్యక్షులు చిరుమల శ్రీను, ఉపాధ్యక్షులు ఉగ్గి బాలరాజ్, సంపత్ కుమార్, కుమార స్వామి, పంపర ఉపేందర్, కృష్ణ,నాయకులు అశోక్ ,ఏం జంగయ్య ,వి జంగయ్య ,కే మైసయ్య ,శ్రీకాంత్ ,ఏం లింగస్వామి ,రాములు ,సిహెచ్ మహేష్,సంతోష్ ,రాజు లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -