జిల్లా న్యాయ సేవఅధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వి రజిని
నవతెలంగాణ – వనపర్తి/ పెబ్బేరు
వికలాంగులు పి.ఎం దక్ష యోజనలో వివరాలు నమోదు చేసుకోవాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ జిల్లా కార్యదర్శి, సీనియర్ న్యాయమూర్తి వి రజని అన్నారు. సోమవారం వనపర్తి జిల్లలోని పెబ్బేరు మండలంలో వికలాంగుల పునరావాస కేంద్రంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని వికలాంగులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి రజని మాట్లాడుతూ మానసిక, శారీరక బాల దివ్యాంగులను పునరావాస కేంద్రాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. దివ్యాంగ్ జన్ రోజ్ గర్ సేతు, దివ్యాంగ్ జన్ కౌశల్ వికాస్ పథకాల గురించి వివరించారు. దివ్యాంగులు అందరికీ కూడా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సేవలు అందిస్తామని తెలియజేశారు.
ఉచిత న్యాయ సలహాల కోసం 15100 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించవచ్చని తెలియజేశారు. పెబ్బేర్ మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి వి రజని విద్యార్థులకు బాల్య వివాహాల నిషేధ చట్టం, బాల కార్మికుల నిర్మూలన చట్టం, మోటార్ వాహనాల చట్టం, ఉచిత, నిర్బంధ విద్య హక్కు చట్టం, ఫోక్సో చట్టం గురించి అవగాహన కల్పించారు. పెబ్బేర్ లోని మహాత్మ జ్యోతి బాపూలే పాఠశాలను సందర్శించి పాఠశాలలో లీగల్ లిటరసీ క్లబ్ ను ప్రారంభించి క్లబ్ లో ఉన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు నిర్వర్తించవలసిన కార్యక్రమాల గురించి వివరించారు. కార్యక్రమాలలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, కళాశాల ప్రధానోపాధ్యా యులు ఓబుల్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కవిత, పారా లీగల్ వాలంటీర్లు సుశీల, శేఖర్ చారి పాల్గొన్నారు.
దివ్యాంగులు పీఎం దక్ష యోజనలో వివరాలు నమోదు చేసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES