22 నెలలు గడుస్తున్న పెంచని పెన్షన్
నవతెలంగాణ – నసురుల్లాబాద్
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని మర్చిపోయిందని, దివ్యాంగులకు పింఛన్లు పెంచకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సాయిలు ఆరోపించారు. సోమవారం బీర్కూర్ తహసీల్దార్ కార్యాలయానికి దివ్యాంగులు ర్యాలీగా తరలి వచ్చి, నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ భుజంగరావుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం అధ్యక్షుడు సాయిలు మాట్లాడారు. ఎన్నికల సమయంలో దివ్యాంగులకు ఇందిరమ్మ ఇండ్లు, రూ. 4 వేల నుంచి రూ.6 వేలుకు పింఛన్ పెంచి ఇస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారని ఆయన అన్నారు. ఇప్పటికీ ప్రభుత్వం హామీ ఇచ్చి 22 నెలలు గడుస్తున్నా ఇంత వరకు ఆ ఊసే లేదని అన్నారు. దివ్యాంగులు అంటే అంత అలుసుగా ఉందా, దివ్యాంగుుల సమస్యలు మీకు పట్టవా అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాములు, గంగారాం, హైమద్, మల్లప్ప, ప్రసాద్ తదితరులు ఉన్నారు
దివ్యాంగులు అంటే ఎందుకంత అలుసు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES