Tuesday, September 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం 

పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం 

- Advertisement -

పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి 
కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ 
నవతెలంగాణ -పెద్దవంగర

నిరుపేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో పాలన కొనసాగిస్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు రూ. 37 లక్షల విలువైన చెక్కులను తహశీల్దార్ వీరగంటి మహేందర్, ఎంపీడీవో వేణుమాధవ్, ఏవో స్వామి నాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ తో కలిసి పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందన్నారు. పేద యువతుల వివాహాలకు కల్యాణ లక్ష్మి గొప్ప పథకంగా నిలుస్తోందని పేర్కొన్నారు. నిరుపేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఉపకరిస్తుందన్నారు. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను అందిస్తామని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తుందని స్పష్టం చేశారు. పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అర్హులకు అందిస్తున్నామని వ్యాఖ్యానించారు. రైతులు ఎవరు ఆందోళన చెందోద్దని, అన్నదాతకు సరిపడా యూరియా అందించేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ప్రభుత్వ పథకాలను ప్రతి గడపకు చేరేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు రంగు మురళి గౌడ్, పొడిశెట్టి సైదులు గౌడ్, విజయ్ పాల్ రెడ్డి, దాసరి శ్రీనివాస్, బానోత్ గోపాల్ నాయక్, ముత్తినేని శ్రీనివాస్, తోటకూరి శ్రీనివాస్, డాక్టర్ సంకెపల్లి రవీందర్ రెడ్డి, బీసు హరికృష్ణ, ఆవుల మహేష్, బండారి వెంకన్న, ఎండీ జాను, లింగమూర్తి, పాషా, యాకయ్య, కరుణాకర్, వెంకన్న, శ్రీనివాస్ ఆర్ఐ భూక్యా లష్కర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -