ముఖంపై చర్మం మెరుస్తూ ఉండాలని చాలా మంది కోరుకుంటారు. దాని కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. మార్కెట్‌లో దొరికే చాలా రకాల బ్యూటీ ప్రొడక్టులను వాడుతుంటారు. అయితే, రసాయనాలు ఎక్కువగా ఉండే పేస్ వాష్‌లు వాడితే చర్మానికి చేటు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కొందరికి ఈ ప్రొడక్టులు సూటవవు. చర్మం పొడిగా మారుతుంది. అయితే, ఫేస్ వాష్‌లు వాడకున్నా ముఖం మెరుపు పెంచేందుకు మీ వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలు బాగా ఉపయోగపడతాయి. అవేవో.. వేటితో తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
శనగపిండి, పెరుగుతో..
ముఖం క్లీన్ చేసుకునేందుకు ఫేష్‌వాష్ బదులు.. శనగపిండి, పెరుగు మిశ్రమాన్ని వాడొచ్చు. దీని వల్ల చర్మం మెరుపు పెరగటంతో పాటు మెటిమలు, మచ్చలు లాంటి సమస్యలు తగ్గుతాయి. ఇది చర్మానికి బాగా మేలు చేస్తుంది
ఎలా చేయాలి: ముందుగా కాస్త శనగపిండి తీసుకోవాలి. దాంట్లో రెండు స్పూన్‌ల పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. శనగపిండి, పెరుగు మిశ్రమాన్ని కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దాన్ని ముఖానికి స్క్రబ్‌లా మసాజ్ చేసుకోవాలి. ముఖమంతా బాగా రాసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ముఖాన్ని నీటితో కడిగేసుకోవాలి.
ఫేస్ వాష్‌కు బదులు..
- Advertisement -
- Advertisement -