ఇటీవల ‘ఓజీ’ చిత్రం నుండి విడుదలైన ‘ట్రాన్స్ ఆఫ్ ఓమి’ సామాజిక మాధ్యమాల్లో సంచలనం సష్టించిన సంగతి తెలిసిందే. ఆ తుఫాను నుండి అభిమానులు ఇంకా బయటకు రాకముందే, ‘గన్స్ ఎన్ రోజెస్’ గీతం విడుదలై, విశేష స్పందనతో ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సష్టిస్తోంది అని చిత్ర యూనిట్ తెలిపింది. తమన్ స్వరపరిచిన ఈ పాట శ్రోతలను ‘ఓజీ’ తాలూకా ఉత్కంఠభరితమైన, యాక్షన్-ప్యాక్డ్ ప్రపంచంలోకి లోతుగా తీసుకెళుతుంది. తమన్ తనదైన స్వరకల్పనతో మరో అగ్ని తుఫానుని సష్టించారు. ఉరుములను తలపించే బీట్స్, పదునైన అమరికలతో మలిచిన ‘గన్స్ ఎన్ రోజెస్’ గీతం.. చిత్ర కథ తీవ్రత, స్థాయిని సంపూర్ణంగా తెలియజేస్తోంది. అలాగే తమన్ అత్యున్నత సంగీత నైపుణ్యం ఈ గీతంతో ఈ చిత్రంపై అభిమానుల ఆసక్తిని, అంచనాలను రెట్టింపు చేసింది. ఇది కేవలం పాట కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోషించిన శక్తివంతమైన పాత్ర గంభీర క్రూరమైన ప్రపంచం, అతని చుట్టూ ఉన్న ప్రమాదకరమైన శక్తులను పరిచయం చేసే ఒక గ్లింప్స్. ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని నిర్మించారు.