Friday, May 9, 2025
Homeట్రెండింగ్ న్యూస్హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభించిన సీఎం..

హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభించిన సీఎం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ముంపు బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కారాలు అందించడంలో హైడ్రా కీలక పాత్ర పోషిస్తోందని ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హైడ్రా కార్యక్రమంలో భాగంగా, సికింద్రాబాద్‌లోని బుద్ధ భవన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన హైడ్రా పోలీస్ స్టేషన్ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హైడ్రాకు కేటాయించిన నూతన వాహనాలు, యంత్రాలను కూడా సీఎం ఆవిష్కరించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. ప్రజలు ఏ ప్రభుత్వ విభాగాన్ని సంప్రదించాలో తెలియని క్లిష్టమైన సమస్యలను సైతం హైడ్రా స్వీకరించి, పరిష్కరిస్తోందని తెలిపారు. “ఏదైనా సమస్య మా పరిధిలోకి రాదని చెప్పి మేం ఎప్పుడూ గిరిగీసుకోలేదు. ఏ శాఖకు సంబంధించిన బాధ్యత అయినా, తక్షణమే స్పందించి ఆ పనిని మేం పూర్తి చేస్తున్నాం” అని వివరించారు. హైడ్రా చొరవ కారణంగా నగరంలో చెరువులు, నాలాల ఆక్రమణలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -