Tuesday, September 16, 2025
E-PAPER
Homeబీజినెస్వాహన ఉత్పత్తిలో తగ్గుదల

వాహన ఉత్పత్తిలో తగ్గుదల

- Advertisement -

ఆగస్టు విక్రయాల్లో 9 శాతం తగ్గుదల
న్యూఢిల్లీ : వాహనాల ఉత్పత్తిలో తగ్గుదల చోటు చేసుకుంది. ఈ ఏడాది ఆగస్టులో నెలలో ప్యాసింజర్‌ వాహనాల ఉత్పత్తిలో 4.1 శాతం తగ్గుదల చోటు చేసుకున్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు తయారీదారులు డీలర్లకు పంపిన డెలివరీలు దాదాపు 9 శాతం తగ్గాయి. వాహనాలపై జిఎస్‌టిని తగ్గించనున్నామని కేంద్రం ప్రకటించిన తర్వాత ఒక్కసారిగా అమ్మకాలు తగ్గాయి. ధరల తగ్గింపు ఆశతో వినియోగదారులు కొనుగోలు నిర్ణయాలను వాయిదా వేసుకుంటున్నారని.. దీంతో అనేక డీలర్‌షిప్‌లలో రిటైల్‌ అమ్మకాలు దెబ్బతిన్నాయని ఆ వర్గాలు తెలిపాయి. దీంతో ఆగస్టు చివరి నాటికి కార్ల ఇన్వెంటరీ నిల్వలు 60 రోజులకు చేరుకున్నాయి. మొత్తం ఛానల్‌ ఇన్వెంటరీ దాదాపు 6,00,000 యూనిట్లకు చేరింది. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి డెలివరీలు 8 శాతం తగ్గాయి. ఎంఅండ్‌ఎం 9 శాతం కంటే ఎక్కువ, హ్యుందారు మోటార్‌ ఇండియా డిస్పాచ్‌లు సుమారు 10 శాతం తగ్గాయి.’గడిచిన ఆగస్టులో ప్యాసింజర్‌ వెహికల్‌ అమ్మకాలు గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 8.8 శాతం తగ్గి 3,22,000 యూనిట్లకు చేరాయి. మొత్తం ప్రయాణికుల వాహనాల ఉత్పత్తి 4 శాతం తగ్గి 1,25,000 యూనిట్లకు పరిమితమయ్యాయి.” అనిసొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ (సియోమ్‌) డైరెక్టర్‌ జనరల్‌ రాజేష్‌ మీనన్‌ పేర్కొన్నారు. ద్వి, త్రిచక్ర వాహన అమ్మకాలు 7.1 శాతం పెరిగి 18.3 లక్షల యూనిట్లుగా చోటు చేసుకున్నాయి. స్కూటర్‌ అమ్మకాలు 12.7 శాతం, మోటార్‌సైకిళ్లు 4.3 శాతం చొప్పున పెరిగాయి. సియోమ్‌ గణాంకాల ప్రకారం.. ఆథర్‌ డిస్పాచ్‌లు దాదాపు 70 శాతం పెరిగి 22,757 యూనిట్లకు చేరాయి. హీరో మోటోకార్ప్‌ 5.4 శాతం వృద్ధిని నమోదు చేయగా..రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ డిస్పాచ్‌లు 56 శాతం పెరిగాయి. గడిచిన ఆగస్టులో మూడు చక్రాల వాహనాల అమ్మకాలు 8.3 శాతం పెరిగి 76,000 యూనిట్లకు చేరాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -