నవతెలంగాణ-మంచిర్యాల
మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో నాగ్‌పూర్ టూ సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ హాల్టింగ్‌ను సోమవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజరు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ రైల్వే చరిత్రలో వందే భారత్ విప్లవాత్మక మార్పులు తెచ్చిందని, దేశవ్యాప్తంగా ప్రస్తుతం 150 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని తెలిపారు. వీటి ద్వారా ఇప్పటి వరకు 3కోట్ల మంది ప్రయాణికులు ప్రయోజనం పొందారని, ఒక్కో వందే భారత్ రైలు తయారీకి సుమారు రూ.130కోట్లు ఖర్చవుతాయని వివరించారు.
ప్రస్తుతం తెలంగాణలో 5 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని, త్వరలో మరో 2 రైళ్లురాబోతు న్నాయని తెలిపారు. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి కోసం కేంద్రం సుమారు రూ.80వేల కోట్లు వెచ్చించనుందని చెప్పారు. అమృత్ భారత్ పథకం కింద రైల్వేస్టేషన్లు మినీ ఎయిర్‌పోర్టుల్లా రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు. మంచిర్యాల అభివృద్ధికి ప్రత్యేక నిధు లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి కోసం రూ.3.5కోట్లు కేటాయించామని, త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అదనంగా స్టేషన్ అభివృద్ధికి అమృత్ భారత్ పథకం కింద రూ.26కోట్లు కేటాయిం చామన్నారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ, కలెక్టర్ కుమార్ దీపక్, పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పాల్గొన్నారు.
మంచిర్యాలలో వందే భారత్ ట్రైన్ హాల్టింగ్ ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES