Tuesday, September 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజ్వాలాముఖి సతీమణి సీతాదేవి కన్నుమూత

జ్వాలాముఖి సతీమణి సీతాదేవి కన్నుమూత

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రముఖ విప్లవ కవి, దిగంబర కవుల్లో ఒకరైన జ్వాలాముఖి జీవిత సహచరిణి సీతాదేవి(85) అనారోగ్య సమస్యలతో సోమవారం హైదరాబాద్‌ లోని అంబర్‌పేటలో స్వగృహంలో కన్నుమూశారు. సీతాదేవి కొంతకాలంగా విపరీతమైన మోకాళ్ల నొప్పులు, జ్వరంతో బాధపడుతున్నారు. దానికి తోడు వృద్ధాప్య సమస్యలు తోడయ్యాయి. అనారోగ్య సమస్యలు తీవ్రం అవ్వడంతో ఆదివారం ఒక ప్రయివేటు ఆస్పత్రిలో జాయిన్‌ అయ్యారు. స్వయంగా ఆమె తమ్ముడు డాక్టర్‌ చారి పర్యవేక్షణలో చికిత్స కూడా అందించారు. సోమవారం తెల్లవారుజామున పరిస్థితి విషమించి ఆమె కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు అంబర్‌పేట శ్మశాన వాటికలో సోమవారం సాయంత్రం ముగిశాయి. జ్వాలాముఖి 2008లో మరణించిన సంగతి తెలిసిందే. ఆ దంపతులకు ముగ్గురు కుమారులు సంపత్‌, శ్రీధర్‌, వాసు కాగా కొన్నేండ్ల కిందట శ్రీధర్‌ మరణించారు. సనాతన శ్రీవైష్ణవ కుటుంబంలో పుట్టినప్పటికీ సీతాదేవి కుటుంబాన్ని విప్లవ ఆదర్శాలకు అనుగుణంగా నడిపారు. ఆమె మృతి సాహిత్యలోకానికి తీరని లోటు అని తెలంగాణ సాహితీ స్రవంతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనందాచారి, అధ్యక్షులు వల్లభాపురం జనార్ధన పేర్కొంటూ సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -