పోస్టర్ ఆవిష్కరణలో టి. సాగర్ వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఈనెల 19, 20, 21 తేదీల్లో వరంగల్‌లో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో వైజ్ఞానిక శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నట్టు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్ వెల్లడించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో అందుకు సంబంధించిన పోస్టర్లను సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు అరిబండి ప్రసాదరావుతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులపై రైతులకు, రైతు కార్యకర్తలకు అవగాహన కల్పించేందుకు మూడు రోజులపాటు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ రంగం నిపుణులు పాల్గొంటారని చెప్పారు. ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్‌లో నూతనంగా వచ్చిన అంశాలపై సమగ్ర సమాచారాన్ని అందిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, రైతాంగంపై చూపుతున్న ప్రభావం తదితరాంశాలను చర్చించి భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు. తద్వారా రాష్ట్రంలో ఐక్య ఉద్యమాలను నిర్వహిస్తామని చెప్పారు.
ఈనెల 19, 20, 21 తేదీల్లో శిక్షణా తరగతులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES