Friday, May 9, 2025
Homeతెలంగాణ రౌండప్పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ..

పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ..

- Advertisement -

ముఖ్యఅతిథిగా హాజరైన జడ్పీ సీఈఓ శోభారాణి…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
: యాదాద్రి భువనగిరి జిల్లాలోని 45 పంచాయతీ కార్యదర్శులకు ” సమాచార హక్కు చట్టం,  గ్రామ సభల నిర్వహణ ” పై  2 రోజుల శిక్షణ కార్యక్రమం   నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా పంచాయతీ అధికారి సునంద , జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి  శోభారాణి లు హాజరై,  మాట్లాడారు.  సమాచార హక్కు చట్టాన్ని గ్రామ పంచాయతీలో సమర్థంగా అమలు చేయాలని,  తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం గ్రామ సభలు నిర్వహించాలని,రికార్డు సక్రమంగా నిర్వహించాలని ,ఈ  శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని  పంచాయతీ కార్యదర్శులను సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీకాంత్, టి వో టి శిక్షణ నిర్వాహకులు నవీన్ కుమార్, దినాకర్, వెంకటేశ్వర్లు, సి ఓ ఆర్డినేటర్ వెంకటేశ్వర్లు  పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -