నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని మీసేవ కేంద్రాలను తాసిల్దార్ గుడిమల్లం ప్రసాద్ ఆదేశాల మేరకు మంగళవారం మండల రెవెన్యూ అధికారి శరత్ తనిఖీ చేశారు. ఇటీవల మీసేవ కేంద్రాల్లో అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో మీ సేవ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించినట్లు మండల రెవెన్యూ అధికారి శరత్ తెలిపారు. సిటిజెన్ చార్టర్ సరిగ్గా ఉంచాలని, ప్రతి ట్రాన్సక్షన్ కి రసీదు ఇవ్వాలని, ఆధార్ కరెక్షన్ లకు, వివిధ సర్టిఫికెట్ లకు నిర్దేశించిన రుసుము మాత్రమే తీసుకోవాలని మీసేవ కేంద్రాల నిర్వహకులకు స్పష్టం చేశారు. తనిఖీ సందర్భంగా మీ సేవ కేంద్రం వరకు వచ్చిన లబ్ధిదారులతో మాట్లాడారు. పనుల నిమిత్తం వచ్చినప్పుడు ఎంత రుసుము వసూలు చేస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు. విచారణ రిపోర్ట్ ను పై స్థాయి అధికారులకు నివేదించనున్నట్లు ఆయన తెలిపారు.
మీ సేవ కేంద్రాల తనిఖీ ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES