Wednesday, September 17, 2025
E-PAPER
Homeఖమ్మంజాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన స్థానిక వ్యవసాయ విద్యార్ధులు

జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన స్థానిక వ్యవసాయ విద్యార్ధులు

- Advertisement -

– ప్రణాళిక బద్దమైన అభ్యసనం మే ఉత్తమ ఫలితాలకు తార్కాణం
– అసోసియేట్ డీన్ హేమంత కుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట

కృషి,పట్టుదల,చిత్తశుద్దితో కూడిన ప్రణాళిక బద్దమైన కార్యాచరణను పాటిస్తే ప్రతి విద్యార్థి తను అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని స్థానిక వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత కుమార్ అన్నారు. జాతీయ స్థాయీ పోస్ట్ గ్రాడ్యుయేట్  ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు పొందిన విద్యార్ధుల అభినందన సభను సోమవారం కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలు వెల్లడించారు.

స్థానిక వ్యవసాయ కళాశాల  2021 బ్యాచ్ కి చెందిన విద్యార్థులు ఈ ఏడాది జులై లో ఐకార్ – ఐసీఏఆర్( భారతీయ వ్యవసాయ పరిశోదన మండలి )నిర్వహించిన అఖిల భారత ప్రవేశ పరీక్ష (ఏఐఈఈ –  పీజీ ) – 2025 లో పలు విభాగాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించారు.దాదాపు 50 మంది విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్ష రాయగా అధిక శాతం విద్యార్థిని విద్యార్థులు వివిధ విభాగాల్లో మంచి ప్రతిభను కనబరిచారు.అందులో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన వారి వివరాల ఈ విధంగా ఉన్నాయి.

కళాశాల లో ని ఐసీఏఆర్ – జేఆర్ఎఫ్ శిక్షణ బృందం ఆద్వర్యంలో నిర్వహించిన వివిధ అతిథి ప్రసంగాలు,పూర్వ విద్యార్థుల తో చర్చా గోష్టి ఈ పరీక్ష తయారీ లో ఎంతో దోహదపడ్డాయి అని వారు తెలిపారు.కళాశాలలో తాము నేర్చుకున్న పాఠ్యాంశాలు,క్షేత్ర స్థాయిలో పంటలు సాగు, నేర్చుకున్న విషయాలు పరీక్ష తయారీకి ఎంతగానో  ఉపయోగపడ్డాయి అని తెలిపారు విద్యార్ధులు తెలిపారు. 

ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్ డీన్  డాక్టర్ జె. హేమంత కుమార్ మాట్లాడుతూ వ్యవసాయ విద్యార్థులు ఉన్నత స్థాయి ప్రవేశ పరీక్షలు,ఇతర ప్రభుత్వ  ప్రవేశ పరీక్షల తయారీకి అన్నీ సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ర్యాంకులు సాదించిన విద్యార్థిని విద్యార్థులు కళాశాల లోని ఇతర సంవత్సర విద్యార్థులు అందరికీ ఆదర్శంగా నిలిచారు అని కొనియాడరు.ఉత్తమ ర్యాంకులు సాదించిన విద్యార్థిని విద్యార్థులకు ఆయనతో పాటు బోధన సిబ్బంది అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -