Wednesday, September 17, 2025
E-PAPER
Homeఖమ్మంబారులు తీరిన గెలలు వాహనాలు

బారులు తీరిన గెలలు వాహనాలు

- Advertisement -

– అధికమొత్తంలో పెరిగిన గెలలు దిగుబడి
– ఈ నెలలోనే 50 వేల టన్నులు అధిగమించే అవకాశం
– ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి
– రైతుల డిమాండ్
నవతెలంగాణ – అశ్వారావుపేట

తరుచూ వానలు కురవడంతో గెలలు త్వరితగతిన పక్వానికి వచ్చి పామాయిల్ గెలల దిగుబడి విపరీతంగా పెరిగింది. దీంతో సేకరించిన గెలలు ను రైతులు రైతులు పరిశ్రమలకు తరలిస్తున్నారు. పరిశ్రమల సామర్ధ్యం మించి గెలలు రావడంతో గెలలు గానుగ ఆడటంతో జాప్యం ఏర్పడుతుంది. ఈ కారణం ప్లాట్ ఫాం ల నిండా గెలలు పోగు బడుతున్నాయి. దీంతో గెలలు దిగుమతి లో గంటలు తరబడి జాప్యం నెలకొంది. గతేడాది సెప్టెంబర్ లో మొత్తం రెండు పరిశ్రమలో పరిధిలో 42354.630 వేల టన్నులు గెలలు దిగబడి కాగా ఈ ఏడాది ఈ సెప్టెంబర్ నెలలో 16 రోజులకే 26245 మెట్రిక్ టన్నుల గెలలు గానుగ ఆడారు.

మంగళవారం నాటికే అప్పారావు పేట లో 2200,అశ్వారావుపేట లో 1500 ల మెట్రిక్ టన్నుల గెలలు రెండు పరిశ్రమల ప్లాట్ ఫాం ల పై నిల్వ ఉన్నాయి. పరిశ్రమల బయట గెలలు సేకరించిన వాహనాలు 200 వాహనాలు వేచి ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటికే 50 వేల టన్నులు గెలలు పరిశ్రమలకు చేరాయి.ఇది అధిక రికార్డ్ గా మేనేజర్ లు కళ్యాణ్ గౌడ్,నాగ బాబు లు తెలిపారు. గతేడాది ఆయిల్ ఇయర్ లో 2 లక్షల 25 వేల టన్నులు గెలలు దిగుబడి అయ్యాయని ఈ ఏడాది 3 లక్షల 10 వేలు టన్నుల గెలలు రావచ్చు అని అన్నారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి : రైతులు

గెలలు దిగుమతి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రైతులు పిన్నమనేని మురళి,మొగళ్ళపు చెన్నకేశవ రావు లు మేనేజర్ నాగబాబు కోరారు. దిగుమతి లో జాప్యంతో రైతులు వాహనాలను గంటలు తరబడి ఉంచడంతో డ్రైవర్ లకు అదనపు వ్యయం అవుతుందని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -