”ఓజీ’తో దాదాపు రెండున్నరేళ్ల ప్రయాణం నాది. ఈ ప్రయాణాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం రావడం అదష్టంగా భావిస్తున్నాను’ అని కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్ తెలిపారు. పవన్ కళ్యాణ్ హీరోగా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మించిన చిత్రం ‘ఓజీ’. సుజీత్ దర్శకుడు. ఈనెల 25న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మంగళవారం కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్ పాత్రికేయులతో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమాలో కణ్మని పాత్ర చేశాను. నేను చేసిన పాత్రల్లో చాలా ఇష్టమైన పాత్ర ఇది. ఈ పాత్రకి నా మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది 1980-90లలో జరిగే కథ. నా పాత్రను మలిచిన తీరు, ఆహార్యం అప్పటికి తగ్గట్టుగానే ఉంటుంది. కణ్మని ఒక ఇన్నోసెంట్ స్వీట్ గర్ల్. గంభీర పాత్రతో గాఢమైన ప్రేమలో ఉంటుంది. గంభీర జీవితాన్ని మలుపు తిప్పే పాత్ర నాది. ఇందులో యాక్షన్ అనేది ఒక భాగం మాత్రమే. బలమైన కథ ఉంది.
అలాగే ఫ్యామిలీ డ్రామా కూడా ఉంది. తమన్‌తో మొదటిసారి పని చేశాను. ప్రతి పాటకి వైవిధ్యమైన సంగీతం అందించారు. ఇందులో ఆయన స్వరపరిచిన మొదటి పాట ‘సువ్వి సువ్వి’నే. విడుదల తర్వాత అందరికీ ఈ పాట నచ్చడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. దర్శకుడు సుజీత్‌కు సీన్స్ చిత్రీకరణపై, నటీనటుల నటనపై.. ఇలా ప్రతి విషయంపై స్పష్టత ఉంది. నా క్యారెక్టర్, లుక్ బాగున్నాయంటే దానికి కారణం ఆయనే. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ నాకు హోమ్ ప్రొడక్షన్‌లా అయిపోయింది. డీవీవీ బ్యానర్‌లో వరుసగా రెండు సినిమాలు చేసే అవకాశం రావడం అదష్టంగా భావిస్తున్నారు. నిజానికి నేను మొదట ‘ఓజీ’ సినిమానే అంగీకరించాను. కానీ, ‘సరిపోదా శనివారం’ చిత్రం ముందుగా విడుదలైంది. నిర్మాతలు దానయ్య, కళ్యాణ్ చాలా మంచి మనుషులు. వాళ్లంటే నాకు అపారమైన గౌరవం.
‘ఓజీ’ జీవితాన్ని మలుపు తిప్పే పాత్ర
- Advertisement -
- Advertisement -