Wednesday, September 17, 2025
E-PAPER
Homeజాతీయంనవంబర్‌ 26న పార్లమెంట్‌ మార్చ్‌

నవంబర్‌ 26న పార్లమెంట్‌ మార్చ్‌

- Advertisement -

కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల జాతీయ సదస్సు నిర్ణయం
భవిష్యత్తు కార్యాచరణ
డిసెంబర్‌- జనవరిలో ఉమ్మడి ప్రచారం నిర్వహించాలి.
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

దేశంలో కార్మిక, రైతు, వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారానికి నవంబర్‌ 26న పార్లమెంట్‌ మార్చ్‌కు ఆయా సంఘాలు సమాయత్తమయ్యాయి. మంగళవారం నాడిక్కడ హరికిషన్‌ సింగ్‌ సుర్జీత్‌ భవన్‌లో కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు సీఐటీయూ అధ్యక్షులు కె. హేమలత, ఏఐకేఎస్‌ అధ్యక్షులు అశోక్‌ దావలే, ఎఐఏడబ్ల్యూయూ అధ్యక్షులు ఎ.విజయ రాఘవన్‌ అధ్యక్షత వహించారు. తపన్‌ సేన్‌ (సీఐటీయూ), విజూకష్ణన్‌ (ఏఐకేఎస్‌), బి.వెంకట్‌ (ఎఐఏడబ్ల్యూయూ) డిక్లరేషన్‌ను ప్రతిపాదించారు. దీనిని సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. దేశవ్యాప్తంగా 35మంది ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ దేశంలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల ఐక్య పోరాటాలను తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని కార్పొరేట్‌-మతతత్వ శక్తులు, నయా ఉదారవాద శక్తులు దూకుడుగా ముందుకు సాగుతున్నాయని అన్నారు. రాజ్యాంగాన్ని తారుమారు చేయడంతో శ్రమజీవుల ప్రజాస్వామ్య హక్కులను అణచివేస్తున్నారని తెలిపారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ సంస్థల స్వయంప్రతిపత్తి, న్యాయవ్యవస్థ, ఎన్నికల కమిషన్‌ మొదలైన వాటిపై, రాష్ట్రాల సమాఖ్య హక్కులపై ప్రమాదకరంగా దాడి చేస్తున్నారని దుయ్యబట్టారు. ఫాసిస్ట్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ నియంత్రణలో ద్వేషాన్ని వ్యాప్తి చేయడంతో ప్రజల ఐక్యతను దెబ్బతీసేందుకు బీజేపీ విభజన హిందూత్వ మతతత్వ ఎజెండాను ముందుకు తీసుకువెళ్తోందన్నారు. కేంద్రంలో, రాష్ట్రాలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పేదరికం, ఆకలి, నిరుద్యోగం, దుర్భరమైన జీవన పరిస్థితులు, నయా ఉదారవాద దాడి కారణంగా తీవ్ర సంక్షోభం వంటి జీవనోపాధి సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి సంఫ్‌ు పరివార్‌ చేస్తున్న దుష్ట ప్రయత్నాలకు ప్రోత్సాహాన్ని అందిస్తుందని విమర్శించారు. కార్పొరేట్‌-మత విధానాలను ప్రతిఘటించడంలో పోరాటాలు దృఢంగా ఉండాలని అన్నారు. ఈ అమానవీయ ప్రజా వ్యతిరేక, దేశ వ్యతిరేక విధాన పాలనకు నిజమైన ప్రత్యామ్నాయాలను ప్రొజెక్ట్‌ చేస్తూ సమిష్టిగా ఉద్యమించాలని నొక్కి చెప్పారు. సార్వత్రిక ప్రాథమిక హక్కులైన ఆహారం, ఉపాధి, కనీస వేతనాలు, ప్రసూతి ప్రయోజనాలు, క్రెచ్‌లు, ఆరోగ్యం, విద్య, గృహ నిర్మాణం, రవాణా, పెన్షన్‌ను డిమాండ్‌ చేస్తూ భారీ పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. జాతీయ సహకార విధానం, వ్యవసాయ మార్కెటింగ్‌పై జాతీయ విధాన చట్రం, నూతన విద్యా విధానం, జాతీయ ద్రవ్యీకరణ పైప్‌లైన్‌ (మానిటైజేషన్‌) పేరుతో ప్రయివేటీకరణ, రాష్ట్రాల పన్ను అధికారాన్ని హరించిన జీఎస్టీ సంస్కరణను తిప్పికొట్టడం వంటి పోరాటాలను నిర్మించాలని అన్నారు.

– డిమాండ్లు నెరవేరే వరకు కార్పొరేట్‌, మతతత్వ సంబంధాల వినాశకరమైన దుష్ప్రవర్తనలకు వ్యతిరేకంగా ప్రజల మిలిటెంట్‌, ఐక్య దీర్ఘకాలిక పోరాటాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యాన్ని జాతీయ కన్వెన్షన్‌ పునరుద్ఘాటింది.

– ప్రధాన సమస్యలను గుర్తించ డానికి, ఉమ్మడి ప్రచారం, ఐక్య కార్యాచరణ కోసం ఒక ప్రణా ళికను సిద్ధం చేయడానికి సీఐటీయూ, ఏఐకేఎస్‌, ఎఐఏడబ్ల్యూయూ రాష్ట్ర ఆఫీస్‌ బేరర్లు నెలలోపు సమావేశమై జిల్లాలో ఉమ్మడి ప్రచా రాల కోసం నిర్దిష్ట కార్యక్రమాన్ని ప్లాన్‌ చేస్తారు.

అక్టోబర్‌ చివరి నాటికి రాష్ట్ర నాయకత్వం సమక్షంలో జిల్లా ఆఫీస్‌ బేరర్ల సంయుక్త సమావేశాలను నిర్వహించాలి.
– మూడు సంఘాల జిల్లా నాయకత్వ భాగస్వామ్యం, మార్గదర్శకత్వంతో నవంబర్‌ మధ్య నాటికి మూడు సంఘాల కేడర్ల బ్లాక్‌/సబ్‌ డివిజన్‌/తాలూకా/మండల స్థాయి సమావేశాలు పూర్తి చేయాలి. స్థానిక సమస్యలను నిర్దిష్టంగా గుర్తించి, ఈ సమావేశాల్లో వివరణాత్మక ప్రచార ప్రణాళికను రూపొందించాలి.
నవంబర్‌
26న న్యూఢిల్లీలో పార్లమెంటు మార్చ్‌తో పాటు భారీ జిల్లా స్థాయి ప్రదర్శనలు నిర్వహించాలి.
– జనవరి 19న కార్మిక-రైతు ఐక్యత దినోత్సవం సందర్భంగా మూడు సంఘాలు జిల్లా స్థాయిల్లో భారీ ప్రదర్శనలు చేపట్టాలి.

డిమాండ్స్‌
ఉపాధి హామీ కింద పని, పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి.
– విద్యుత్‌ ప్రయివేటీకరణ, ప్రీ-పెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లను రద్దు చేయాలి.
– భూమి/అటవీ హక్కుల కోసం, ఎల్‌ఎఆర్‌ఆర్‌ చట్టం 2013ని ఉల్లంఘించడంతో దేశంలోని వివిధ ప్రాంతాలలో కార్పొరేట్‌ భూ కబ్జా ఆపాలి.
– వడ్డీ వ్యాపారులు, మైక్రో ఫైనాన్సింగ్‌ సంస్థలపై, ప్రజలపై, ముఖ్యంగా గిరిజన జనాభాపై దాడిని ఆపాలి.
– సహజ వనరులను దోచుకోవడం, సుంకం లేని దిగుమతులను ఆపాలి.
– అంగన్‌వాడీలు/పాఠశాలలు/ఆస్పత్రులలో సేవలను ఉపసంహరించుకోవడం, ప్రయివేటీకరణ ఆపాలి.
అతి సంపన్నులపై పన్ను విధించాలి
.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -