Wednesday, September 17, 2025
E-PAPER
Homeసినిమా'కిష్కింధపురి'కి మెగాస్టార్‌ ప్రశంసలు

‘కిష్కింధపురి’కి మెగాస్టార్‌ ప్రశంసలు

- Advertisement -

రీసెంట్‌గా విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న ‘కిష్కింధపురి’ చిత్రం అగ్ర కథానాయకుడు చిరంజీవిని సైతం మెప్పించి, ప్రశంసలు పొందింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ నటించిన చిత్రం ‘కిష్కింధపురి’. కౌశిక్‌ పెగల్లపాటి దర్శకత్వంలో షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించిన చిరంజీవి ఒక ప్రత్యేక వీడియోలో తన రివ్యూని షేర్‌ చేశారు.
‘నా రాబోయే చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ పండక్కి వస్తోంది. నిర్మాత సాహూ గారపాటి మరో చిత్రం ‘కిష్కింధపురి’ విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా చూసిన నాకు మంచి ప్రయత్నం చేశారని అనిపించింది. సాధారణంగా హర్రర్‌ సినిమాలంటే భయాన్ని ఎలివేట్‌ చేస్తూ, ఒక దెయ్యం కథ చెప్పడం జరుగుతుంది. కానీ ఇందులో హర్రర్‌తో పాటు మంచి సైకలాజికల్‌ పాయింట్‌ కూడా యాడ్‌ చేసి చెప్పడం చాలా బాగుంది.

శారీరక వైకల్యం కంటే మానసిక వైకల్యం చాలా ప్రమాదకరమని చెప్పడం, మనిషికి ఉన్న బాధలు, కష్టాలు పక్క వాళ్ళకి చెప్పుకోకుండా ఒంటరితనం అనుభవిస్తుంటే వచ్చే ప్రమాదాలు, పరిణామాలను చాలా సమర్థవంతంగా డైరెక్టర్‌ కౌశిక్‌ చిత్రీకరించారు. ఈ సినిమా ద్వారా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అలాగే అనుపమ పరమేశ్వరన్‌ కూడా మంచి విజయాన్ని దక్కించుకున్నారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ చేతన్‌ భరద్వాజ్‌ తన పనితనం చాలా బాగా చూపించారు. టోటల్‌గా ‘కిష్కింధపురి’ లాంటి మంచి సినిమాని అందించిన టేస్ట్‌ ఫుల్‌ నిర్మాత సాహు గారపాటికి నా హదయపూర్వక అభినందనలు. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది’ అని చిరంజీవి పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -