Wednesday, September 17, 2025
E-PAPER
Homeసినిమా'తెలుసు కదా' షూటింగ్‌ పూర్తి

‘తెలుసు కదా’ షూటింగ్‌ పూర్తి

- Advertisement -

‘మిరాయ్‌’ లాంటి పాన్‌ ఇండియా బ్లాక్‌ బస్టర్‌ తర్వాత పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మోస్ట్‌ ఎవైటెడ్‌ మ్యూజికల్‌ రొమాంటిక్‌ ఎంటర్టైనర్‌ ‘తెలుసు కదా’. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్లు. స్టైలిస్ట్‌-ఫిల్మ్‌ మేకర్‌ నీరజా కోన దర్శకత్వంలో టిజి విశ్వ ప్రసాద్‌, కృతి ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం తాజాగా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. లోకేషన్‌లో చిత్ర బృందం కేక్‌ కట్‌ చేసుకుని సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఇటీవలే రిలీజ్‌ చేసిన టీజర్‌కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఫస్ట్‌ సాంగ్‌ ‘మల్లిక గంధ’ చార్ట్‌ బస్టర్‌ హిట్‌ అయ్యింది. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. త్వరలో సెకండ్‌ సాంగ్‌ రిలీజ్‌ కానుంది. డైరెక్టర్‌ నీరజకోన చాలా యూనిక్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. తమన్‌ మ్యూజిక్‌ అందిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌ 17న గ్రాండ్‌గా విడుదల కానుంది అని చిత్ర యూనిట్‌ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -