రన్నరప్‌గా స్టేట్ బ్యూరో జట్టు
హైదరాబాద్ : నవతెలంగాణ క్రికెట్ టోర్నమెంట్ చాంపియన్‌గా వెబ్ జట్టు నిలిచింది. మంగళవారం నిజాం కాలేజ్ గ్రౌండ్‌లో జరిగిన ఫైనల్లో స్టేట్ బ్యూరో జట్టుపై వెబ్ టీమ్ ఉత్కంఠ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బ్యూరో జట్టు 10 ఓవర్లలో 86 పరుగులు చేయగా.. వెబ్ టీమ్ 9.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. రెండు రోజుల పాటు ఉత్సాహంగా సాగిన క్రికెట్ టోర్నమెంట్‌లో ఎనిమిది జట్లు పోటీపడ్డాయి. నవతెలంగాణ 10వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ఉద్యోగులు, కుటుంబ సభ్యులు క్రీడాస్ఫూర్తితో పోటీపడ్డారు. విజేతలు వెబ్ టీమ్, రన్నరప్ బ్యూరో జట్లను నవతెలంగాణ సిజిఎం పి.ప్రభాకర్, ఎడిటర్ రాంపల్లి రమేశ్, హెఆర్ మేనేజర్ నరేందర్ రెడ్డి, బ్యూరో చీఫ్ బివిఎన్ పద్మరాజు, వెబ్ ఇన్‌చార్జి మోహకృష్ణ, మొఫిషిల్ ఇన్‌చార్జి వేణుమాధవ్, బోర్డు సభ్యులు కెఎన్ హరి అభినందించారు.