సుంకాల దెబ్బకు అంపశయ్యపై ఎంఎస్‌ఎంఈలు
అంకెలగారడీతో ఆహా..ఓహో అంటూ మోడీ సర్కార్ ప్రచారం చేసుకుంటోంది. ఇటీవల త్రైమాసికంలో 7.4 శాతం వృద్ధిని సాధించామంటూ బీజేపీ చెబుతున్న మాటలకు..రేటింగ్ ఏజెన్సీల అంచనాలకు అస్సలు పొంతన లేదు. వాస్తవానికి ఇప్పటికే అసంఘటిత రంగం అస్తవ్యస్తమైంది. తాజాగా మోడీ మిత్రుడైన ట్రంప్ విధించిన సుంకాలదెబ్బతో సూక్ష్మచిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ), అందులో పనిచేస్తున్న అసంఘటితరంగ కార్మికుల పరిస్థితి దినదినగండం నూరేండ్ల ఆయుష్షులా మారిపోయింది.
న్యూఢిల్లీ : 400 మిలియన్లకుపైగా కార్మికుల శ్రమతో కూడిన ఆర్థిక వ్యవస్థకు పునాది అసంఘటిత తయారీ రంగం. ఇప్పుడు ఈ రంగం కుప్పకూలిపోతోంది. దీంతో దేశవృద్ధి కాస్త ప్రశ్నార్థకంగా మారింది. ఏప్రిల్-జూన్ 2025 డేటా పరిశీలిస్తే.. నిశ్శబ్ద సంక్షోభం ఉన్నట్టు స్పష్టమవుతోంది. జనవరి-మార్చితో పోలిస్తే ఏప్రిల్-జూన్‌లో అసంఘటిత తయారీ రంగంలో ఉపాధి 9.3 శాతం తగ్గింది. 2.1 శాతం తగ్గి 12.86 కోట్లకు చేరుకుంది. సంస్థల సంఖ్య -4.7 శాతం మేర తగ్గింది. ఉత్పత్తి తిరోగమనం, ద్రవ్యోల్బణం, పెట్టుబడి ఇబ్బం దులు, బలహీనమైన డిమాండ్ ఇలా మరెన్నో కారణాలు ఎంఎస్‌ఎంఈలు మూత పడటానికి కారణమవుతున్నాయి. నోట్ల రద్దు తర్వాత పతనం కోలుకోలేని విధంగా దేశంలోని అన్ని రంగాలూ కుదేలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం చేయూతనిచ్చేలా రుణాలు మంజూరు చేసినా.. అవి పెద్ద సంస్థలు, బడా పారిశ్రామికవేత్తలే లాభపడిన విషయం విదితమే. ప్రధాన క్రెడిట్ వృద్ధి ఉన్నప్పటికీ, ఐఎఫ్‌సీ అంచనా వేసిన రూ.20 శాతం నుంచి 25శాతం వరకు ట్రిలియన్ల భారీ క్రెడిట్ అంతరం కొనసాగు తోంది. ఇది దేశీయ అసమానతలో పాతుకు పోయిన మార్కెట్ వైఫల్యం అని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు..
మెకిన్సే నివేదిక ఈ అగాధాన్ని హైలైట్ చేసింది. ఎంఎస్‌ఎంఈలు 62 శాతం ఉపాధిని కలిగిస్తున్నప్పటికీ.. తయారీ ఉత్పత్తిలో 26 శాతం మాత్రమే ఉత్పత్తి చేస్తాయని పేర్కొంది. సంస్థలు అభివృద్ధి చెందడంలో, విక్రయాలు, ఆవిష్కరణలు ఆశించినమేర ఉండటంలేదు. దీనికి ప్రధాన కారణం మూలధనం, సాంకేతికత, ఉత్పాదక లాభాలు ముడిపడి ఉన్నాయి. ఇది స్థానిక డిమాండ్ తగ్గడం లేదా ప్రపంచ వాణిజ్య వివాదం అయినా.. దీని ప్రభావం అసంఘటితరంగంపై పడుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్‌ఎఫ్) ప్రకారం భారతదేశంలోని 90శాతంకంటే ఎక్కు వ మంది శ్రామికశక్తి అసంఘటితరంగం ఉపాధి లో నిమగమై ఉందని, దేశ జీడీపీకి 50శాతం దోహద పడుతుందని నివేదికలో ప్రస్తావించింది.
మోడీ టు ట్రంప్
ప్రస్తుతం అసంఘటిత రంగం దిక్కు తోచని స్థితిలో ఉన్నది. దేశంలో వ్యవసాయం తర్వాత రెండోస్థానంలో ఉపాధి పొందుతున్న కార్మికులు, చిన్నతరహా పరిశ్రమలు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే ఎన్నో పరిశ్రమలు మూతపడితే. .ఆ రంగాన్నే ఆధారం చేసుకుని బతుకుతున్న కుటుంబాలు రోడ్డునపడ్డాయి.