రూ.40 వేల జరిమానా
నల్లగొండ అదనపు జడ్జి -2 తీర్పు
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
చిన్నారిపై లైంగికదాడి ఘటన పోక్సో కేసులో నల్లగొండ అదనపు జడ్జి -2 మంగళవారం నిందితునికి 23 ఏండ్ల జైలు శిక్ష, రూ.40 వేల జరిమానా విధించినట్టు ఎస్పీ శరత్‌చంద్రపవార్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. 2023 మార్చిలో నల్లగొండ మండలం అన్నెపర్తి గ్రామానికి చెందిన మర్రి ఊషయ్య ఇంట్లో ఒంటరిగా ఉన్న పదేండ్ల బాలికపై లైంగికదాడికి ఒడిగట్టాడు. ఆ తర్వాత జరిగిన దారుణాన్ని బాధితురాలు తల్లికి చెప్పింది. ఈ ఘటనపై 29-03-2023న నల్లగొండ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. నిందితునిపై పోక్సో కేసు నమోదైంది. పోలీసులు పూర్తి విచారణ జరిపి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. అదనపు జడ్జి -2, ఎస్సీ, ఎస్టీ కోర్టు, పోక్సో కేసుల కోర్టు నిందితున్ని దోషిగా నిర్ధారించింది. నేరస్థునికి 23 ఏండ్ల కఠిన కారాగార శిక్ష, రూ.40,000 జరిమానా విధించారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డీఎస్పీ నర్సింహారెడ్డి, ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి, నల్లగొండ డీఎస్పీ కె.శివరాంరెడ్డి, నల్లగొండ రూరల్ సీఐ రాఘవరావు, ఎస్‌ఐ సైదాబాబు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్‌కుమార్, సీడీఓ దుర్గరాజు, లీగల్ ఆఫీసర్ భరోసా సెంటర్ కె.కల్పన, లైజన్ అధికారులు పి.నరేందర్, ఎన్.మల్లికార్జున్‌ను ఎస్పీ అభినందించారు.
పోక్సో కేసులో నిందితునికి 23 ఏండ్ల జైలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES