Wednesday, September 17, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅమరులను అవమానిస్తున్న బీజేపీ

అమరులను అవమానిస్తున్న బీజేపీ

- Advertisement -

నవతెలంగాణ-చేర్యాల
నిజాంకు వ్యతిరేకంగా, భూమి.. భుక్తి.. వెట్టి చాకిరీ నుంచి విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగితే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విమోచన దినోత్సవం పేరిట అమర వీరులను అవమానిస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సంద ర్భంగా మంగళవారం సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ కేంద్రంలోని గాంధీ సెంటర్‌ నుంచి బైరాన్‌పల్లి వరకు నిర్వహిం చిన బైక్‌ ర్యాలీని జాన్‌వెస్లీ, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నిజాం రజాకారుల చేతిలో వీరబైరాన్‌పల్లికి చెందిన 99 మంది ప్రాణం కోల్పోయారని గుర్తు చేశారు. మరో జలియన్‌ వాలాబాగ్‌ దురాగతాన్ని తలపించేలా ఈ ఊచకోత సాగిందని, రైతాంగ సాయుధ పోరాట అమరవీరులను స్మరించేందుకు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రతి ఏటా సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -