Wednesday, September 17, 2025
E-PAPER
Homeబీజినెస్పెట్రోలియం రిజర్వుల్లోకి ఎంఇఐఎల్‌ ప్రవేశం

పెట్రోలియం రిజర్వుల్లోకి ఎంఇఐఎల్‌ ప్రవేశం

- Advertisement -

కర్నాటకలో రూ.5700 కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్‌ : మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఇఐఎల్‌) కొత్తగా వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వు (ఎస్‌పిఆర్‌)లోకి ప్రవేశించింది. ప్రయివేటు రంగంలోని ఓ కంపెనీ ఈ రంగంలో ప్రవేశించడం, భారీగా పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. కర్నాటకలోని పాదుర్‌లో రూ.5,700 కోట్ల వ్యయంతో ఎస్‌పిఆర్‌ యూనిట్‌ను నిర్మించనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా 2.5 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ఎస్‌పిఆర్‌ను నిర్మించాలని నిర్దేశించుకుంది. ఇది భారతదేశం అత్యవసర ముడి చమురు నిల్వలకు గణనీయంగా దోహదపడుతుందని ఆ వర్గాలు భావిస్తున్నాయి. దేశంలో ప్రస్తుతం విశాఖపట్నం, మంగళూరు, పడూర్‌లో ఎస్‌పిఆర్‌లు ఉన్నాయి. వీటిల్లోని నిల్వలు ప్రస్తుతం దేశ అవసరాలను 8-9 రోజుల డిమాండ్‌ను తీర్చగలవు. ఎంఇఐఎల్‌ యూనిట్‌ అందుబాటులోకి వస్తే ఇది మరింత పెరగనుంది. ప్రపంచ సరఫరా అంతరాయాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు లేదా ఊహించని డిమాండ్‌ పెరిగినా దేశ ఇంధన బఫర్‌కు తోడ్పడనుంది. ఈ రిజర్వ్‌ను నిర్మించడానికి ఎంఇఐఎల్‌కు ఐదేండ్లు సమయం పడుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -