Wednesday, September 17, 2025
E-PAPER
Homeజాతీయంఇది భారత్‌ కాదా?

ఇది భారత్‌ కాదా?

- Advertisement -

పంజాబ్‌ పోలీసులను ప్రశ్నించిన రాహుల్‌
కాంగ్రెస్‌ నేతను అడ్డుకున్న బలగాలు

చండీఘర్‌ : పంజాబ్‌లోని రావి నది సమీపంలో వరద ప్రభావిత గ్రామాన్ని సందర్శించేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీని పోలీసులు ఇటీవల అడ్డుకున్న ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రాజకీయ వివాదానికి దారితీసింది. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు రాహుల్‌ పంజాబ్‌ వచ్చారు. అమృతసర్‌, గురుదాస్‌పూర్‌ జిల్లాలలో వరద బాధిత కుటుంబాలను పరామర్శించారు. అమృతసర్‌లోని ఘోనెవాల్‌, గురుదాస్‌పూర్‌లోని గుర్‌చక్‌ గ్రామాలలో పర్యటించిన అనంతరం భారత్‌-పాకిస్తాన్‌ సరిహద్దులోని తూర్‌ గ్రామానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే రావి నదిని దాటకుండా ఆయనను పోలీసు అధికారులు నిలువరించారు. భద్రతా పరమైన సమస్యల కారణంగా అనుమ తించలేమని ఆయనకు చెప్పారు. దీనిపై రాహుల్‌ మండిపడ్డారు.

ఆయన పోలీసు అధికారులను నిలదీస్తున్న దృశ్యాలకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌ అవుతోంది. ఆయన ఆ గ్రామం వైపు చూపిస్తూ ‘భారత భూభాగంలో నన్ను క్షేమంగా ఉంచలేమని మీరు చెబు తున్నారా? ఇది భారతదేశం కాదా?’ అని ఓ సీనియర్‌ పంజాబ్‌ పోలీస్‌ అధి కారిని ప్రశ్నించారు. రాహుల్‌ వెంట ఉన్న పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు అమరీందర్‌ సింగ్‌ రాజా, ఎంపీ సుఖ్‌జిందర్‌ సింగ్‌ రంధావాలు పోలీసు అంక్షలను తప్పుపట్టారు. ‘పంజాబ్‌ పోలీసులు రక్షణ కల్పించలేరన్న కారణం తో ప్రతిపక్ష నాయకుడు పర్యటించకూడదని మీరు చెబుతున్నారా?’ అని నిలదీశారు. కాగా ఈ ఘటనపై పలువురు కాంగ్రెస్‌ నాయకులు విమర్శలు కురిపించారు. పంజాబ్‌లోని ఆప్‌ ప్రభుత్వం భద్రతను సాకుగా చూపి వరద ప్రభావిత సరిహద్దు గ్రామంలో పర్యటించకుండా రాహుల్‌ను అడ్డుకున్నదని ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -