Wednesday, September 17, 2025
E-PAPER
Homeజాతీయంఉద్యమ స్ఫూర్తితో స్వచ్ఛాంధ్ర

ఉద్యమ స్ఫూర్తితో స్వచ్ఛాంధ్ర

- Advertisement -

జనవరి నుండి చెత్త కనిపించకూడదు
రెండోరోజు కలెక్టర్ల సమావేశంలో సిఎం

అమరావతి : రాష్ట్రంలో అమలుచేస్తున్న స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. సచివాలయంలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో రెండవరోజైన మంగళవారం ఆయన స్వచ్ఛాంద్ర, సర్క్యులర్‌ ఎకానమీ వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలన్నారు. స్వచ్ఛ భారత్‌ కోసం రాష్ట్రంలో ఏ జిల్లాలోనైనా కేంద్రప్రభుత్వం పైలట్‌ ప్రాజెక్టుగా కార్యక్రమం తీసుకుంటే దానిని రాష్ట్రమంతా వర్తింపజేయాలన్నారు. ఇప్పటికే 83 లక్షల టన్నుల చెత్తను రాష్ట్రవ్యాప్తంగా తొలగించామని, జనవరి నుండి చెత్త ఎక్కడా కనిపించకూడదని చెప్పారు. చెత్తపై పన్ను కూడా రద్దు చేశామన్నారు. స్వచ్ఛత అంటే పరిశుభ్రత పాటించడమే కాదని, ప్రజల ఆలోచనా విధానం కూడా మారాలని తెలిపారు. చెత్తను డ్రెయిన్లలో వేయడం వల్ల అవి ప్రవాహానికి అడ్డు వస్తున్నాయని, అలాంటి అలవాట్లు లేకుండా చేయాలని తెలిపారు. ఎలాంటి కార్యక్రమమైనా ప్రజల భాగస్వామ్యంతోనే విజయవంతం అవుతుందని పేర్కొన్నారు.

చేతివృత్తులకు చేయూత
ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు సంస్కృతి, సంప్రదాయమని, ఆ బొమ్మలకు అవసరమైన కలప కోసం చెట్లు పెంచడానికి కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని తెలిపారు. చేతివృత్తులు, కులవృత్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -