Friday, May 9, 2025
Homeఖమ్మంఅందుబాటులో రాయితీ పచ్చిరొట్ట విత్తనాలు: ఏడీఏ రవికుమార్ 

అందుబాటులో రాయితీ పచ్చిరొట్ట విత్తనాలు: ఏడీఏ రవికుమార్ 

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట: వారి సాగుకు ముందు పెంచేందుకు రాయితీ పై పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు రవికుమార్ గురువారం తెలిపారు. ఆయన అశ్వారావుపేట లోని తన కార్యాలయంలో విలేకర్లు తో మాట్లాడారు. అశ్వారావుపేట నియోజక వర్గంలోని రైతులు వరి సాగుకు ముందు పచ్చిరొట్ట పైర్లు సాగు చేయాలని ఆయన కోరారు.వరి పండించే నేలల్లో భూసారం పెరగడానికి పచ్చిరొట్ట పైర్లు సాగు చేయాలని కోరారు.పచ్చిరొట్ట  పంటల సాగ కొరకు రాయితీ పై విత్తనాలు సిద్దంగా ఉన్నాయన్నారు.వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద కూపన్ పొంది సమీపంలోని ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయంలో పొందవచ్చని అన్నారు. పచ్చిరొట్ట పైర్లు జనుము,జీలుగ, పిల్లి పెసర రాయి పై అందిస్తామన్నారు.జీలుగ కిలో రూ.71.25 పైసలు,జనుము రూ. 62.75 పైసలు, పిల్లి పెసర రూ. 102 – 75 పైసలు 50 శాతం రాయితీ పోగా చెల్లించి విత్తనాలు పొందవచ్చు అన్నారు.
మునగ సాగు : ప్రతి ఏఈఓ తన క్లస్టర్ లో కనీసం పదిమంది రైతులతో పది ఎకరాలలో  ఈ వానాకాలం మునగ సాగు చేసే విధంగా లక్ష్యం పెట్టుకోవాలని సూచించారు.
నీటి కుంటలు : డివిజన్లో ప్రతి రైతు ఉపాధి హామీ పథకంలో నీటి కుంటల ఏర్పాటు చేసుకోవాలి అన్నారు.నీటి కుంటలు ఏర్పాటు ద్వారా వర్షపు నీటిని సంరక్షిస్తూ,భూగర్భ జలాలను పెంపొందించు కోవచ్చు అన్నారు.నీటి కుంటల లో అజోల్లా సాగు మరియు చేపల పెంపకం చేపట్టి రైతులు అదనపు ఆదాయం పొందవచ్చు అని తెలిపారు.
ఫార్మర్స్ రిజిస్ట్రీ : డివిజన్ లోని పట్టా భూములు కలిగిన ప్రతి రైతు తమ దగ్గర లోని ఏఈఓ ను  సంప్రదించి పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు,మొబైల్ నంబరు తో అను సంధానం చేయించు కోవాలి అన్నారు “కేంద్రప్రభుత్వ పధకాల లో లబ్ధి పొందేందుకు ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అన్నారు.ముఖ్యంగా ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి ద్వారా సంవత్సరానికి రూ. 6 వేలు పొందేందుకు రైతులు ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో శివరాం ప్రసాద్,ఏఈఓ లు సతీష్,షకీరా భాను లు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -