Wednesday, September 17, 2025
E-PAPER
Homeతాజా వార్తలురూ.100 కోట్ల క్లబ్‌లో ‘మిరాయ్‌’..

రూ.100 కోట్ల క్లబ్‌లో ‘మిరాయ్‌’..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : తేజ సజ్జా, మనోజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మిరాయ్‌’ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సెప్టెంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు రాగా.. తొలిరోజు రూ.20 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఐదు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది.

తమ సినిమా రూ.100 కోట్లు సాధించడంపై తేజ సజ్జా, మంచు మనోజ్‌ ఆనందం వ్యక్తం చేస్తూ పోస్ట్‌లు పెట్టారు. ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా ఈ సినిమా సక్సెస్‌ మీట్‌ను విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ప్రేక్షకులంతా కుటుంబంతో కలిసి సినిమా చూడాలన్న ఉద్దేశంతోనే దీని టికెట్‌ ధరలు కూడా పెంచలేదని నిర్మాత తెలిపారు. ఈ విజయం తర్వాత తనలో మరింత బాధ్యత పెరిగినట్లు తేజ చెప్పారు.

ఈ సినిమా దర్శకుడు కార్తిక్‌ ఘట్టమనేని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దీని సీక్వెల్‌లో నిధి అగర్వాల్‌ స్పెషల్‌ సాంగ్‌ ఉంటుందని తెలిపారు. నిధితో ఓ ప్రత్యేక పాట చిత్రీకరించామని.. మొదటి పార్ట్‌లో వాడలేకపోయామన్నారు. సెకండ్‌ పార్ట్ కోసం కొన్ని ఐడియాలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -