నవతెలంగాణ బిచ్కుంద
దేశ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్భంగా బిచ్కుంద మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. మండల అధ్యక్షులు శెట్పల్లి విష్ణు మాట్లాడుతూ పేదరికంలో ఉన్న 25 కోట్ల భారతీయులను పేదరికంలో నుండి బయటకు తీసుకొచ్చిన మహా నాయకుడని దేశ రక్షణ కోసం సేవ చేయడానికి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని వందేళ్ల ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో ఉండాలని ఆకాంక్షిస్తున్నామనీ తెలంగాణ వియేత్సవ దినోత్సవం నాడే ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన కావడం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అరుణతార, నాయకులు పండరి జాదవ్, ముత్యంపిరాజి, మల్లికార్జున్, ధర్మానాయక్, గోపాల్ చారి, మల్లు దేశయ్, గంగరాజు, ప్రకాష్, రాజు ఉన్నారు.