Wednesday, September 17, 2025
E-PAPER
Homeజిల్లాలుపరకాల గడ్డ చారిత్రక ప్రాధాన్యం – అమరుల త్యాగం మరువలేనిది

పరకాల గడ్డ చారిత్రక ప్రాధాన్యం – అమరుల త్యాగం మరువలేనిది

- Advertisement -

ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

నవతెలంగాణ – పరకాల

పరకాల గడ్డ చారిత్రక ప్రాధాన్యత కలిగిన పవిత్ర భూమి, అమరుల త్యాగం ఎప్పటికీ మరువలేనిదని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, అమరధామం, అమరవీరుల స్మారక భవనాల్లో ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా బుధవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రేవూరి పాల్గొని జాతీయ పతాకావిష్కరణ చేసారు అనంతరం ఎమ్మెల్యే స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలను, శాలువాలతో సన్మానించారు.

ఎంఎల్ఏ మాట్లాడుతూ… ఎందరో మహనీయుల పోరాటం, త్యాగఫలితం గానే తెలంగాణలో రజాకార్ల నిరంకుశ పాలన నుంచి విముక్తి పొంది భారత యూనియన్‌లో విలీనం అయిందని గుర్తుచేశారు. అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, హోం మంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ నాయకత్వంలో నిజాం పాలన, రజాకర్ల దౌర్జన్యాలపై సైనిక చర్య జరిగి, తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం లభించిందన్నారు.సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ విమోచనకు సంకేతమని, అదే రోజు రాష్ట్రంలో ప్రజా పాలన దినోత్సవం జరుపుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. “పరకాల అమరుల చరిత్ర భావితరాల తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. వారి త్యాగాలను స్మరించుకుంటూ ప్రజా పాలన దిశగా ముందుకు సాగాలిని ఎమ్మెల్యే రేవూరి పేర్కొన్నారు.

ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలు

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతులు, మహిళలు, యువత సంక్షేమాన్ని కేంద్రబిందువుగా చేసుకొని పనిచేస్తోందని తెలిపారు. పేదలకు సన్నబియ్యం, ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లు, మహిళా యాజమాన్యంలోని పెట్రోల్ బంకులు, క్యాంటీన్లు, సోలార్ ప్రాజెక్టులు, వడ్డీ లేని రుణాలు, అర్హులందరికీ రేషన్ కార్డులు, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాలను అమలు చేస్తోందని వివరించారు. నిజమైన ప్రజా పాలన పరకాల సహా మొత్తం తెలంగాణలో అభివృద్ధి వైపు తీసుకెళ్తుందని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -