Wednesday, September 17, 2025
E-PAPER
Homeజిల్లాలుఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ _తుర్కపల్లి

తుర్కపల్లి మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ దేశ్యానాయక్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో లెంకల గీతారెడ్డి , పిఎసిఎస్ కార్యాలయంలో చైర్మన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి, పోలీస్ స్టేషన్లో ఎస్సై తక్యుద్దీన్, విద్యుత్ సబ్ స్టేషన్ లో ఏ ఈ బిక్షపతి గౌడ్ ,పశు వైద్యశాలలో డాక్టర్ రామచంద్రారెడ్డి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ రుచిరా రెడ్డి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు రాంపల్లి శ్రీనివాస్, గ్రామపంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి శైలజ ,అన్ని గ్రామాల్లోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ వెంకటేశ్వర్లు, సూపరిండెంట్ ఇన్నారెడ్డి ,డిప్యూటీ తహసిల్దార్ కల్పన, సీనియర్ అసిస్టెంట్లు సలీం, ప్రవీణ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్లు జహంగీర్, సంతోష్ పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. …… 

తుర్కపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు ధనావత్ శంకర్ నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు .ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చాడ భాస్కర్ రెడ్డి ,మాజీ ఎంపీటీసీ బోర్ రెడ్డి వనజ హనుమంత రెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు తుమ్మల మమతా తిరుపతిరెడ్డి, బీసీ సెల్ మండల అధ్యక్షుడు రామగొని వెంకటేష్ గౌడ్, జిల్లా కోఆర్డినేటర్ దేవరుప్పల ఐలయ్య, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ దొంకని వెంకటేష్ యాదవ్ ,మండల ఉపాధ్యక్షులు పనగట్ల సుదర్శన్ గౌడ్ ,భూక్య రాజారాం నాయక్, యూత్ అధ్యక్షుడు వల్లపు రమేష్, మండల సేవాదళ్ అధ్యక్షుడు పాముల రాజు, టౌన్ అధ్యక్షుడు బొరెడ్డి మహిపాల్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -