
మండలంలోని అంకాపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారి కూనింటి మహిపాల్ రెడ్డి శుక్రవారం గాంధీభవన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం తాను కృషి చేస్తానని తెలిపారు ..ఈ కార్యక్రమంలో పోశెట్టి, రాజారాం, జేసాఫ్ తదితరులు పాల్గొన్నారు.