Thursday, September 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తల్లిదండ్రులు పిల్లలకు చదువుతోపాటు క్రీడల్లో ప్రోత్సహించాలి

తల్లిదండ్రులు పిల్లలకు చదువుతోపాటు క్రీడల్లో ప్రోత్సహించాలి

- Advertisement -

మాజీ మంత్రి, ఏమ్మల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

వేల్పూర్ మండల అంతర పాఠశాలల క్రీడలు ప్రారంభం

నవతెలంగాణకమ్మర్ పల్లి

తల్లిదండ్రులు పిల్లలకు చదువుతో పాటు క్రీడల్లో కుడా ప్రోత్సాహం అందించాలని మాజీ మంత్రి, ఏమ్మల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. విద్యతో పాటు క్రీడలు కూడా ముఖ్యమైనవని, క్రీడలు ఆడడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసికంగా ప్రశాంతత లభిస్తుందన్నారు.క్రీడలు మనలో క్రీడా స్ఫూర్తిని నెలకొల్పుతాయని తెలిపారు. బుధవారం వేల్పూర్ మండల పాఠశాలల క్రీడత్సవాల ప్రారంభం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి, వివిధ పాఠశాలల విద్యార్థుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు.

అనంతరం మాజీ మంత్రి, ఏమ్మల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎవరైతే క్రీడలు ఆడరో వారు జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు తట్టుకోలేరన్నారు.క్రీడలు వాడేవారు జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకొని వాటిని ఆదిగమించి నిలబడుతారని తెలిపారు. విద్యార్థులు క్రీడల్లో క్రమశిక్షణతో క్రీడా స్ఫూర్తిని చాటాలని సూచించారు. క్రీడల వల్ల స్నేహభావం పెంపొందుతుందని తెలిపారు.ఆర్మూర్ డివిజన్ లో మంచి వ్యాయామ ఉపాధ్యాయులు ఎక్కడ క్రీడలు జరిగిన అందరు కలిసికట్టుగా ఉండి సమన్వయంతో వాటిని విజయవంతం చేస్తారన్నారు. అనంతరం మార్చ్ ఫాస్ట్ లో విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో మండల విద్యాధికారిని రేణుక, పాఠశాల ప్రధానోపాధ్యాయులు క్రీడల కన్వీనర్ రాజేశ్వర్, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -