నవతెలంగాణ వేములవాడ
వేములవాడ పట్టణంలో బహుజన సేన ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బుధవారం పెరియర్ రామస్వామి నాయర్ చిత్రపటానికి పూలమాలలు వేసి 146వ జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బహుజన సేన రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు జింక శ్రీధర్ మాట్లాడుతూ, “భారతదేశంలో నిచ్చెన మెట్ల కులవ్యవస్థకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన పెరియర్ రామస్వామి నేటి యువతకు ఆదర్శం కావాలి” అని పిలుపునిచ్చారు. సమాజంలో కొనసాగుతున్న అసమానతలపై యువత ముందుకు వచ్చి పోరాడాలని, శూద్ర వర్గాలను కులవ్యవస్థ బంధనాల నుండి విముక్తి చేసి బహుజన రాజ్యాధికారాన్ని సాధించాలన్న సంకల్పంతో కృషి చేయాలని ఆయన సూచించారు.బ్రాహ్మణ మనువాద కుట్రలను ఎదుర్కొని ద్రావిడ సంస్కృతిని కాపాడడం, మానవతా సమాజ నిర్మాణం కోసం పెరియర్ స్ఫూర్తి అత్యంత అవసరమని జింక శ్రీధర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బహుజన సేన జిల్లా ఉపాధ్యక్షుడు సుంకరి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి లక్కే సాగర్, వేములవాడ రూరల్ మండల అధ్యక్షుడు నేదూరి శ్రీకాంత్, లక్కే దినాకర్, మల్లారం హరీష్, లక్కే ప్రమోద్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.