నవతెలంగాణ-మల్హర్‌రావు: మండల కేంద్రమైన తాడిచెర్ల బ్లాక్-1 ఓసీపీలో బుధవారం ప్రాజెక్టు వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు సీనియర్ జనరల్ మేనేజర్ కె ఎస్ ఎన్ మూర్తి ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కార్యక్రమం వచ్చే నెల రెండో తారీకు వరకు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.కార్యక్రమంలో భాగంగా ఉద్యోగులు, కార్మికులకు మాస్కులు,శానిటైజర్లు, టీషర్ట్లు పంపిణీ చేశారు. అలాగే ముగ్గురు పారిశుద్ధ కార్మికులకు వారి సేవలను గుర్తించి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వాడక నిషేధం, మొక్కలు నాటడం, పరిసరాల పరిశుభ్రత ను నిర్వహించారు.భారత ప్రభుత్వం, కోల్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆదేశానుసారం రాబోయే 15 రోజుల పాటు రోజుకో కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మైన్ మేనేజర్ శ్రీనివాస్, సేఫ్టీ ఆఫీసర్ సురేష్ బాబు, హెచ్ఆర్ డీజీఎం రమేష్ బాబు, అధికారులు, ఉద్యోగులు, సూపర్వైజర్లు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
తాడిచర్ల ఓసీపీలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం.
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES