హీరో తేజ సజ్జా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘మిరాయ్’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈనెల 12న రిలీజైన ఈ చిత్రం బ్రహ్మండ్ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకుంది. అద్భుతమైన కలెక్షన్స్‌తో హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ విజయవాడలో బ్రహ్మాండ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహించారు. మంత్రి కందుల దుర్గేశ్, ఎం.ఎల్.ఏ. రఘురామకృష్ణంరాజు, డైరెక్టర్స్ బాబీ, సందీప్ రాజ్ హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. హీరో తేజ మాట్లాడుతూ,’ఈ సినిమా సక్సెస్ కార్తీక్ ఘట్టమనేనిది, విశ్వప్రసాద్‌ది, మంచు మనోజ్‌ది, శ్రీయది, రితికాది టీం అందరిది. మమ్మల్ని ఆశీర్వదిస్తున్న ఆడియన్స్‌ది. తెలుగు ఫిలిం ఇండిస్టీది. నా వంతు ప్రయత్నం నేను చేశాను. నాకు అవకాశం ఇవ్వడమే గొప్ప వరం. ఈ సక్సెస్‌ని నేను ఎంతో బాధ్యతగా ఫీల్ అవుతున్నాను’ అని అన్నారు. ”ఇంద్ర’ సినిమా 175 డేస్ విజయవాడలోనే జరిగింది. ఆరోజు వచ్చిన వేలాదిమందిలో నేనూ ఉన్నాను. ఆరోజు చిరంజీవితో స్టేజి మీద ఉన్న చిన్న బుడ్డోడు తేజ. ఈ రోజు పాన్ ఇండియా స్టార్‌గా అదరగొడుతున్నాడు. ‘హనుమాన్’ లాంటి సక్సెస్ తర్వాత ఒక సినిమాను నమ్ముకుని మూడేళ్లు పాటు డెడికేషన్‌తో వర్క్ చేయడం మామూలు విషయం కాదు.
తన డెడికేషన్‌కి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ‘మిరాయ్’. ఈ సినిమాతో నిర్మాతగా విశ్వ ప్రసాద్ అమ్మాయి కృతి ప్రసాద్ పరిచయమయ్యారు. తొలి సినిమాతో ఇంత అద్భుతమైన విజయం అందుకున్న వారికి అభినందనలు’ అని డైరెక్టర్ బాబీ చెప్పారు. మంచు మనోజ్ మాట్లాడుతూ,’ఈ సినిమా చూసిన తర్వాత మా అమ్మ నన్ను పట్టుకుని చాలా ఎమోషనల్ అయిపోయారు. అందరికీ ఫోన్ చేసి మా అబ్బాయి హిట్ కొట్టాడని చెప్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. అలాగే మా అక్క కూడా చాలా ఆనంద పడింది. నా ఫ్యామిలీ అంతా కలిసి సినిమా చూస్తుంటే ఆ అనుభూతి జీవితంలో మర్చిపోలేను. నా విజయాన్ని మీ విజయంగా తీసుకుంటూ నన్ను ముందుకు నడిపిస్తున్న అభిమానులకు, స్నేహితులకు అందరికీ పాదాభివందనం’ అని తెలిపారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ,’ఈ సక్సెస్ కోసం చాలా కాలం ఎదురు చూసాం. మా అమ్మాయి ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేసిన సినిమా ఇది. తన ఫస్ట్ సినిమానే సక్సెస్ అవడం వెరీ హ్యాపీ. ఈ సినిమాకి చాలా అద్భుతమైన విఎఫ్‌ఎక్స్ వర్క్ జరిగింది. సినిమాకి వాయిస్ ఇచ్చిన ప్రభాస్‌కి థ్యాంక్స్’ అని అన్నారు.
‘మిరాయ్’ విజయం మనందరిది : హీరో తేజ సజ్జా
- Advertisement -
- Advertisement -