చంద్రహాస్ హీరోగా జైరామ్ చిటికెల దర్శకత్వంలో శ్రీకాంత్ రాజా రత్నం నిర్మిస్తున్న చిత్రం ‘కాయిన్’. బుధవారం చంద్రహాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్, టైటిల్ పోస్టర్‌ను దర్శకుడు సాయి రాజేష్ రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లా డుతూ,”’కాయిన్’ సినిమాతో ఇండిస్టీలోకి కొత్త టాలెంట్ రావాలని కోరుకుంటున్నాను. ప్రభాకర్‌తో నాకు చాలా ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. చంద్రహాస్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ‘కాయిన్’ చుట్టూ ఇంత జరిగిందా? అని కథ చెప్పి నప్పుడు షాక్ అయ్యా. ట్రైలర్ వచ్చిన తరువాత చిత్రంపై మరింత అంచనాలు పెరుగుతాయని నమ్మకంగా ఉన్నాను’ అని అన్నారు. ‘యథార్థ సంఘటనల ఆధారంగా మా దర్శకుడు జైరామ్ ఈ మూవీని తీస్తున్నారు. పాత ఐదు రూపాయల కాయిన్స్‌ని బ్యాన్ చేయడం, ఆ కాయిన్స్ మెల్ట్ చేయడం, వాటి నేపథ్యంలో క్రైమ్ అనే పాయింట్లతో కథ అద్భుతంగా ఉంటుంది’ అని చంద్రహాస్ చెప్పారు. దర్శకుడు జైరామ్ చిటికెల మాట్లాడుతూ, ‘ఐదు రూపాయల కాయిన్ ఎందుకు బ్యాన్ అయింది? అనే నేపథ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను. మా ఫస్ట్ ఫ్లిప్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. మా హీరో చంద్రహాస్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ ఫ్లిప్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాను. నిమిషి మ్యూజిక్ అద్భుతంగా ఉండబోతోంది. సమ్మర్‌లో మా సినిమాని రిలీజ్ చేస్తాం’ అని అన్నారు. ”కలర్ ఫోటో’కి సాయి రాజేష్ నన్ను లైన్ ప్రొడ్యూసర్‌గా తీసుకున్నారు. జైరామ్ చెప్పిన కథ విని చంద్రహాస్ ఈ ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పారు’ అని లైన్ ప్రొడ్యూసర్ గంగాధర్ తెలిపారు.