Thursday, September 18, 2025
E-PAPER
Homeఆటలుసీఎస్‌ఎస్‌హెచ్‌తో శ్రీనిధి ఒప్పందం

సీఎస్‌ఎస్‌హెచ్‌తో శ్రీనిధి ఒప్పందం

- Advertisement -

హైదరాబాద్‌: శ్రీనిధి దక్కన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌(ఎస్‌డీఎఫ్‌సీ) తమ ప్లేయర్ల ఫిట్‌నెస్‌ విషయంలో మరో ముందడుగు వేసింది. ప్లేయర్ల ఫిట్‌నెస్‌, ఆరోగ్యంపై దృష్టి సారిస్తూ సెంటర్‌ ఫర్‌ స్పైన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ హెల్త్‌(సీఎస్‌ఎస్‌హెచ్‌)తో శ్రీనిధి ఎఫ్‌సీ ఎంవోయూ కుదుర్చుకుంది. ఇక నుంచి శ్రీనిధి దక్కన్‌ క్లబ్‌ అధికారిక స్పోర్ట్స్‌ సైన్స్‌ భాగస్వామిగా సీఎస్‌ఎస్‌హెచ్‌ కొనసాగనుంది. ఈ మేరకు సీఎస్‌ఎస్‌హెచ్‌ కోఫౌండర్‌, బ్యాడ్మింటన్‌ ఐకాన్‌ పుల్లెల గోపీచంద్‌తో కలిసి ఎస్‌డీఎఫ్‌సీ చీఫ్‌ ఫుట్‌బాల్‌ ఆఫీసర్‌ ఫాబియో పెరీరా బుధవారం ఒప్పందం పత్రాలు మార్చుకున్నారు. ఒప్పందం ప్రకారం శ్రీనిధి ఎఫ్‌సీ ప్లేయర్లు..సీఎస్‌ఎస్‌హెచ్‌లో అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలు పొందవచ్చు. ప్లేయర్ల ఇంజూరీ మేనేజ్‌మెంట్‌, రిహాబిలిటేషన్‌పై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎస్‌ఎస్‌హెచ్‌ పని చేయనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -