Thursday, September 18, 2025
E-PAPER
Homeఆటలుఫైనల్‌కు నీరజ్‌ చోప్రా

ఫైనల్‌కు నీరజ్‌ చోప్రా

- Advertisement -

తొలి ప్రయత్నంతోనే బెర్త్‌
సచిన్‌ యాదవ్‌ కూడా..
ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌
వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు నీరజ్‌ చోప్రా.. తొలి త్రోలోనే అద్భుతం!

టోక్యో: భారత స్టార్‌ జావెలిన్‌ స్టార్‌ నీరజ్‌ చోప్రా తొలి ప్రయత్నంలోనే ఫైనల్‌ బెర్త్‌ దక్కించుకున్నాడు. జపాన్‌లోని టోక్యో వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా బుధవారం జరిగిన క్వాలిఫైయింగ్‌ రౌండ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ నీరజ్‌ చోప్రా తన తొలి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించాడు. ఫైనల్‌కు అర్హత మార్క్‌ 84.50 మీటర్లను దాటాడు. నీరజ్‌ చోప్రా తొలి ప్రయత్నంలో బల్లెం 84.85 మీటర్ల దూరం విసిరి సునాయాసంగా ఫైనల్లోకి అడుగుపెట్టారు. నీరజ్‌ చోప్రా తన గ్రూపులో ఉన్న ఆరుగురు అథ్లెట్లలో మొదటి రౌండ్‌లోనే నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించిన ఏకైక ఆటగాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో నీరజ్‌ చోప్రా ఫైనల్‌ పోటీ కోసం గురువారం బరిలోకి దిగనున్నాడు. నీరజ్‌ చోప్రాతో పాటు పాకిస్తాన్‌కు చెందిన అర్షాద్‌ నదీమ్‌ కూడా ఫైనల్లో చేరాడు. భారత్‌కు చెందిన మరో జావెలిన్‌ త్రోయర్‌ సచిన్‌ యాదవ్‌(83.67మీ.) 10వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. టాప్‌-12లో నిలిచిన త్రోయర్ల మధ్య నేడు పతక పోటీ జరగనుంది. పారిస్‌ ఒలింపిక్స్‌ తర్వాత ఆర్షాద్‌ నదీమ్‌, నీరజ్‌ చోప్రా ముఖాముఖి తలపడడం ఇదే తొలిజారి. ఆ ఒలింపిక్స్‌లో అర్షాద్‌ నదీమ్‌ 92.97 మీటర్ల త్రోతో గోల్డ్‌ గెలుచుకోగా.. నీరజ్‌ చోప్రా 89.45 మీటర్ల త్రోతో రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఫైనల్‌కు చేరిన టాప్‌-12 జావెలిన్‌ త్రోయర్లు…

  1. ఆండర్సన్‌ పీటర్స్‌ : గ్రెనడా
  2. జులియన్‌ వెబెర్‌ : జర్మనీ
  3. జూలియస్‌ యేగో : కెన్యా
  4. డేవిడ్‌ వెగ్నార్‌ : పోలండ్‌
  5. ఆర్షాద్‌ నదీమ్‌ : పాకిస్తాన్‌
  6. నీరజ్‌ చోప్రా : ఇండియా
  7. కర్టిస్‌ థామ్సన్‌ : అమెరికా
  8. జాకబ్‌ వెడ్‌జెక్‌ : చెఛియా
  9. కేస్ట్రన్‌ వెల్‌కాట్‌ : ట్రినిడాడ్‌ అండ్‌ టుబాగో
  10. సచిన్‌ యాదవ్‌ : ఇండియా
  11. కేమరన్‌ మెక్‌ ఎంట్రీ : ఆస్ట్రేలియా
  12. రుమేశ్‌ పథీరగే : శ్రీలంక
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -