- Advertisement -
– రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో 12.6 సెంటీమీటర్ల వాన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో బుధవారం ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 11:00 గంటల వరకు 439 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి పరిధిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతంలో అత్యధికంగా 12.6 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలో బుధవారం రాత్రి అకస్మాత్తుగా పలు చోట్ల భారీ వర్షం పడింది. ఆ మూడు జిల్లాల పరిధిలో 26 చోట్ల భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు కూడా వర్షాలు పడే సూచనలు బలంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్ కె.నాగరత్న తెలిపారు.
- Advertisement -